Sailesh Kolanu: హాట్ టాపిక్ గా మారిన హిట్2 దర్శకుడు శైలేష్ కొలను కామెంట్స్..!

2020 లో వచ్చిన హిట్ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ మూవీ మిస్సింగ్ కేసు పాయింట్ తో తెరకెక్కింది. సినిమా క్లైమాక్స్ లో హిట్ సెకండ్ కేస్ ఉంటుంది అని హింట్ ఇచ్చారు. కానీ హీరో మారిపోయాడు. అది ఎందుకు అన్నది తెలీదు. ఇక హిట్ 2 సినిమా ఓ సైకో కిల్లర్ కథాంశంతో రూపొందింది అని టీజర్ స్పష్టం చేసింది.

టీజర్ లాస్ట్ షాట్ లో ఓ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికేసి పారేసినట్టు చూపించి అందరినీ భయపెట్టారు. ఇందువల్ల యూట్యూబ్ లో హిట్ 2 టీజర్ ను డిలీట్ చేసినట్టు చర్చ జరిగింది. ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఇంకా ఉంటాయని డైరెక్టర్ చెప్పాడు. బహుశా ఇందుకే విశ్వక్ సేన్ ఈ కథకి నొ చెప్పి ఉండొచ్చు అనే కథనాలు కూడా వినిపించాయి. అన్నీ ఎలా ఉన్నా ఇలాంటి సన్నివేశాలు ఉంటే సమాజంలో అహింస, మహిళల పై దాడులు ఇంకా పెరిగిపోయాయని.

ఇలాంటివి చూసి బయట ఉన్న జనాలు కూడా ఇలాంటి అగాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉందని డిస్కషన్లు నడిచాయి. ఇలాంటి వాటి పై దర్శకుడు శైలేష్ కొలను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ట్రైలర్ లాంచ్ లో అతను మాట్లాడుతూ.. ” ‘ఈ ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సరిగ్గా నిద్రపోయి 9 రోజులు అవుతోంది. సినిమా మూడ్ ఇది. అది చెప్పేందుకు ట్రైలర్‌ను ఇలా కట్ చేశాం… టీజర్‌ను అలా కట్ చేశాం.

ఇలాంటి క్రైమ్‌ను చూపించడం అనేది ఓ స్టైల్ గా చూపించడం లేదు. ఓ మంచి చెడు మీద ఎలా గెలుస్తుంది అనే దాని పై అవగాహన రావడం కోసం చూపించాం. సమాజంలో జరిగే దానికే ప్రతీకగానే సినిమాలు ఉంటాయని ఈ ఘటనలు (దిశా, శ్రద్దా వాకర్) నిరూపిస్తున్నాయి. అలాంటి సైకోలకు సినిమాలే స్పూర్తి అని చెప్పలేము. మంచికి స్పూర్తిలా ఉండేలానే సినిమాలు తీస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus