చిరంజీవి బృందంలో ఇంట్రనేషనల్ టెక్నీషియన్లు
- June 20, 2017 / 06:13 AM ISTByFilmy Focus
భారతీయ చిత్ర పరిశ్రమను బాహుబలి పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రం ఇప్పుడు అందరికీ ఒక కొలమానంగా మారింది. ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ ఉండాలి. స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలని కోరుకునే వారు పెరిగారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఖైదీ నంబర్ 150 తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. గ్రాండ్ సక్సస్ అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర బృందంలో ఇంట్రనేషనల్ టెక్నీషియన్లు ఉండేలా చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ అడుగులు వేస్తున్నారు. చిరు 151 వ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా పనిచేయనున్నట్లు తెలిసింది.
భారతీయుడు వంటి దేశభక్తి సినిమాలకు రెహ్మాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా స్వాతంత్ర సమరయోధుడి జీవిత గాధ. కాబట్టి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడం గ్యారంటీ. అంతేకాదు హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా పేర్లు వినిపిస్తున్నాయి. ఇక గ్రాఫిక్స్ కోసం ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ ను రంగంలోకి దించారు. అదిరిపోయే గ్రాఫిక్స్ తో అదరగొట్టిన బాహుబలి ప్రాజెక్టు వెనక ఉన్నది ఇతడే. ఇలా టాప్ టెక్నీషియన్స్, బాలీవుడ్ నటీ నటులతో ఈ మూవీ తెరకెక్కబోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















