Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

  • May 16, 2025 / 11:54 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల  (Sushmita Konidela) , కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత, ఇప్పుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. తన తండ్రి చిరంజీవి హీరోగా, దర్శకుడు అనీల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న సినిమాతో సుస్మిత నిర్మాతగా మొదటి అడుగు వేస్తోంది. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సంస్థ ద్వారా సుస్మిత భాగస్వామిత్వంతో కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్‌లను నిర్మించినప్పటికీ, సినిమా నిర్మాణంలోకి రావడం ఇదే తొలిసారి.

Chiranjeevi

Sushmita Konidela How Much is Megastar Chiranjeevi’s Remuneration for Daughter’s Film

ఈ సినిమా చిరంజీవికి 157వ చిత్రంగా నిలవనుంది, దీన్ని సుస్మితతో కలిసి సాహుగారపాటి కూడా నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణంలో ఇద్దరు భాగస్వాములు ఉండటంతో, చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఆసక్తి నెలకొంది. సుస్మిత ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం, దీని వల్ల నిర్మాణ ఖర్చుల్లో డిజైనర్ రెమ్యునరేషన్ ఆదా అవుతుంది. అయితే, చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని, మార్కెట్ లెక్కల ప్రకారం చెల్లించాల్సిందేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!
  • 2 Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!
  • 3 మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

చిరంజీవి ఇటీవల ఒకే చేసిన సినిమాలకు 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, సుస్మిత నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు ఆయన ఎంత తీసుకుంటారనేది ఇంకా స్పష్టత లేదు. కొన్ని వర్గాల ప్రకారం, ఈ సినిమాకు అడ్వాన్స్‌గా సుస్మిత, సాహుగారపాటి (Sahu Garapati) కలిసి కొంత మొత్తం చెల్లించి, మిగిలినది చిత్రీకరణ తర్వాత చెల్లించే అవకాశం ఉంది.

గతంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘ఖైదీ నెం.150’ (Khaidi No. 150), ‘సైరా నరసింహ రెడ్డి’ (Sye Raa Narasimha Reddy ), ‘విశ్వంభర’ (Vishwambhara) వంటి సినిమాలకు పనిచేసిన సుస్మిత, నిర్మాణ సంస్థల నుంచి రెమ్యునరేషన్ అందుకుంది. ఇప్పుడు ఆమె నిర్మాతగా మారి, తండ్రికి రెమ్యునరేషన్ చెల్లించే స్థాయికి ఎదిగింది. 2023లో సుస్మిత నిర్మించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shoban Babu)  విజయం సాధించలేదు, కానీ ఈసారి తండ్రి సినిమాతో ఆమె భారీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుందని, చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కోసం తన మార్కెట్ రేట్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Sushmita Konidela

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

31 mins ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

3 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

16 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

17 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

2 days ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

2 days ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version