ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR విడుదల అనంతరం ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటుందో గాని ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ముందే మంచి ఎమౌంట్స్ వస్తాయని ఒక ఊహ ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఇక సినిమాకు ఇటీవల మరొక భారీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు సినిమా థియేట్రికల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి.
తమిళ్ లో లైకా ప్రొడక్షన్ నార్త్ మొత్తంలో పెన్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డిజిటల్ & శాటిలైట్ రైట్స్ అన్ని భాషల హక్కులు కూడా సింగిల్ పేమెంట్ తో ఒక బడా చానల్ దక్కించుకుంది. ఆ ఛానెల్ మరేదో కాదు జీ5 (ZEE5). పోటీగా ఇతర సంస్థలు వచ్చినప్పటికీ జీ5 సంస్థ ఎవ్వరికీ అందని రేంజ్ లో 325కోట్లకు దక్కించుకుంది. ఈ ఒక్క మార్గంలోనే సగానికి పైగా బడ్జెట్ వెనక్కి వచ్చేసింది. సినిమా కోసం 400కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ రేంజ్ లో లాభాలు రావడంతో సినిమాపై అంచనాల డోస్ మరింత పెరిగాయి. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీగా మార్కెట్ చేస్తున్న చిత్రం. మరి ఈ మార్కెట్ ఈ బడా హీరోలు ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి. ఇక సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవల కొమురం భీమ్ పోస్టర్ లో కూడా మెన్షన్ చేశారు. కానీ ఆ డేట్ కు రావడం అనుమానమేనని మరోక టాక్ వైరల్ అవుతోంది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!