కన్నడ సినిమాలు డబ్ అవ్వడమే గగనం అనుకుంటే అవి హిట్ అవ్వడం అనేది మరింత గగనం అని చెప్పాలి. ఎందుకంటే కన్నడ సినిమాల్లో చాలా వరకు రీమేక్ లే ఉంటాయి. వాళ్ళకి రైట్స్ కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం లేదు.. నచ్చితే ఏ సినిమాని అయినా డైరెక్ట్ గా రీమేక్ చేసుకోవచ్చు అని కొందరు చెబుతుంటారు.అందుకే పునీత్ రాజ్ కుమార్ తప్ప అక్కడ మాస్ హీరోలు అంటూ ఎవ్వరూ లేరు. అయితే ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ తో యష్ పాన్ ఇండియా లెవెల్లో మాస్ ఇమేజ్ ను దక్కించుకున్నాడు.
కచ్చితంగా అతని మార్కెట్ ఇప్పుడు డబుల్ అవుతుంది. ఇక నుండీ అతను చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది.వినడానికి బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. కన్నడంలో ఒక్క ప్రశాంత్ నీల్ తప్ప పాన్ ఇండియా లెవెల్లో స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న దర్శకుడు ఎవ్వరూ లేరు. ఒకవేళ మళ్ళీ ప్రశాంత్ నీల్ తో సినిమా ఎంపిక చేసుకుంటే తప్ప యష్ సినిమాలకి భారీ హైప్ ఏర్పడదు.
ఓపెనింగ్స్ రావు, సినిమాలు హిట్ అవుతాయి అన్న గ్యారెంటీ లేదు. తన ఇమేజ్ ను, మార్కెట్ ను నిలబెట్టే దర్శకులను ఎంపిక చేసుకోవాలి, ఆ రేంజ్ కథ ఉన్న సినిమాలు చేయాలి.కచ్చితంగా కన్నడలో అయితే యష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ‘కె.జి.ఎఫ్’ సిరీస్ ను మ్యాచ్ చేస్తూ సినిమాలు చేసే దర్శకులు లేరు. తెలుగు దర్శకుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు ఖాళీగా లేరు. ఒకవేళ చేద్దాం అనుకున్నా.. ‘కె.జి.ఎఫ్’ కాకుండా యష్ మార్కెట్ ఎంత అనేది అవగాహనకి వచ్చిన తర్వాత చెయ్యాలి.
లేదు ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వేసుకుని సినిమాలు చేస్తే మాత్రం రెండు విధాలుగా అతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి యష్ పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేయడం అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!