దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన బాహుబలికి ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. వారికోసం బాహుబలిని అనేక రూపాల్లో తెస్తున్నారు. అందులో యానిమేషన్ సిరీస్ ఒక్కటి. “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” అనే పేరుతో రూపుదిద్దుకుంటున్న యానిమేషన్ సిరీస్ దాదాపు పూర్తికావచ్చింది. దీనికి సంభందించిన టీజర్ ని మొదట బెంగళూర్, గోవా ప్రాంతాల్లో ఫ్యాన్స్ చూసే వేళ్ళు కల్పించారు. జనవరిలో హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” వర్చువల్ రియాలిటీ టీజర్ ని చూసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక్కడ చాలా మంది ఈ టీజర్ ని చూసి ఆనందించారు. ఈ సదుపాయాన్ని బాహుబలి బృందం శనివారం కరీంనగర్, గాజువాక ప్రాంతాల్లో కల్పించింది. దీంతో దీనిని చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరిచారు.
వయసుతో సంబంధం లేకుండా యువత, పెద్దవారు వీఆర్ ఎక్స్ పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెస్పాన్స్ చూసి బాహుబలి బృందం ఆశ్చర్యపోయింది. ఈ సదుపాయాన్ని రెండురోజులు కొనసాగించాలని ఆలోచిస్తోంది. బాహుబలి కంక్లూజన్ థియేటర్లోకి వచ్చిన నెల తర్వాత “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” సిరీస్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.