Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ‘రాజా విక్రమార్క’ టీజర్ రెస్పాన్స్ అదిరింది… ‘ఆర్ఎక్స్ 100’ రోజులు గుర్తొచ్చాయి! – హీరో కార్తికేయ గుమ్మకొండ

‘రాజా విక్రమార్క’ టీజర్ రెస్పాన్స్ అదిరింది… ‘ఆర్ఎక్స్ 100’ రోజులు గుర్తొచ్చాయి! – హీరో కార్తికేయ గుమ్మకొండ

  • September 4, 2021 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాజా విక్రమార్క’ టీజర్ రెస్పాన్స్ అదిరింది… ‘ఆర్ఎక్స్ 100’ రోజులు గుర్తొచ్చాయి! – హీరో కార్తికేయ గుమ్మకొండ

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

హీరో కార్తికేయ మాట్లాడుతూ “వరుణ్ తేజ్ గారు మా ‘రాజా విక్రమార్క’ టీజర్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవిగారి టైటిల్ తో సినిమా చేశాం. నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టమనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన టైటిల్ పెట్టుకునే అదృష్టం ఈ సినిమా ద్వారా నాకు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేయడం… అంతా కో-ఇన్సిడెన్స్. అలా మాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. సినిమా విషయానికి వస్తే… ‘ఆర్ఎక్స్ 100’ ట్రైలర్ ఇదే రామానాయుడు స్టూడియోలో విడుదల చేశాం. ఆ తర్వాత అందరూ వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు ఎటువంటి ఫీలింగ్, ఎమోషన్స్ ఉన్నాయో… ఇప్పుడు అదే ఫీలింగ్. ‘ఆర్ఎక్స్ 100’ టీజర్, ఈ సినిమా టీజర్ ను కంపేర్ చేయడం లేదు. అప్పుడు… ఇప్పుడు… నా ఎమోషన్ సేమ్ అని చెబుతున్నా. ‘ఆర్ఎక్స్ 100’కు ఎలా పని చేశానో… ఈ సినిమాకు అలాగే పని చేశా. ‘రాజా విక్రమార్క’ షూటింగ్ ఫినిష్ చేసుకుని, డబ్బింగ్ చెబుతూ… టీజర్ విడుదల చేసి, అందరి ముందుకు వచ్చినందుకు గర్వంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత తొలినాళ్లలో ఒప్పుకొన్న కథ ఇది. అప్పటికి నాకు కథలు వినడం కూడా సరిగా రాదు. ఇన్నోసెంట్ మైండ్ తో విన్నాను. వెంటనే నచ్చింది. దర్శకుడు భలే చెప్పాడని అనుకున్నాను. అక్కడ నుండి సినిమాతో మూడేళ్ళు ప్రయాణం చేశాం. సినిమా కథను పక్కన పెడితే… సినిమా చేయడానికి జరిగిన కథను ఒక బయోపిక్ చేయవచ్చు. అంత ప్రాసెస్ జరిగింది. మొదట ఈ సినిమాను మేమే నిర్మించాలని అనుకున్నాం. వేరే సినిమా తీయడం వల్ల దీన్ని వెనక్కి షిఫ్ట్ చేశాం. తర్వాత వేరే కారణాల వల్ల వెంటనే ‘రాజా విక్రమార్క’ స్టార్ట్ చేయలేకపోయాం. అప్పుడు ’88’ రామారెడ్డిగారు, ఆదిరెడ్డిగారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళిద్దరికీ థాంక్స్. వాళ్ళకు సినిమాల్లో పెద్దగా అనుభవం లేదు. నేను కూడా ఒకట్రెండు సినిమాలు చేశా. కొత్త దర్శకుడిని నమ్మి సినిమా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ చేసిన తర్వాత వేరే సినిమా చేసినా… మధ్యలో కరోనా వచ్చినా… ఇబ్బందులు ఎన్ని ఎదురైనా మాకు సపోర్ట్ చేశారు. మా దర్శకుడు శ్రీ సరిపల్లి కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. నాకు ధైర్యం చెప్పేవాడు. సాయికుమార్ గారు, తనికెళ్ల భరణి గారు, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. చందు సినిమాటోగ్రఫీ సూపర్. ఇప్పటివరకు ప్రశాంత్ ఆర్. విహారి ప్రేమకథలు చేశాడు. ఫస్ట్ టైమ్ జానర్ షిఫ్ట్ చేశాడు. అతడు ఇచ్చిన మ్యూజిక్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. టెక్నికల్ గానూ సినిమా హైస్టాండర్డ్స్ లో ఉంటుంది. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ బావుంది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాను. నేను బ్యాచిలర్‌గా చేసిన లాస్ట్ సినిమా ఇది. మంచి హిట్ కొట్టి జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా హిట్ కొడతామని నాకు తెలుసు” అని అన్నారు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ “టీజర్ విడుదల చేసిన వరుణ్ తేజ్ కి థాంక్స్. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ అదిరింది. దర్శకుడు, మా శ్రీ సరిపల్లి వచ్చి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు కార్తికేయ హీరో అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ‘ఆర్ఎక్స్ 100′ చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. కార్తికేయ గురించి చెప్పాలంటే… మంచి బాలుడు. తనతో నటించేటప్పుడు గమనించాను… సెట్ లో ఎంతో ఒదిగి ఉంటాడు. అలాగే, అద్భుతంగా నటించాడు. మన కృష్ణగారిలా తమిళనాడులో రవిచంద్రన్ గారు పెద్ద హీరో. వాళ్ళ అమ్మాయి తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతోంది. తను కూడా బాగా నటించింది. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, ఛాయాగ్రాహకుడు పి.సి. మౌళి… మా ’88’ రామారెడ్డిగారు, ఆదిరెడ్డిగారు… మంచి టీమ్ కుదిరింది. శ్రీ సరిపల్లి మంచి కాన్సెప్ట్ తీసుకుని సినిమా చేశాడు. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. హీరో క్యారెక్టర్ ఎంత జోవియల్‌గా ఉంటుంది అనేది టీజర్‌లో లాస్ట్ డైలాగ్ వింటే అర్థమైంది. తప్పకుండా మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది. ఇండస్ట్రీ బావుండాలి. అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బావుండాలి. అందులో మా ‘రాజా విక్రమార్క’ ఉండాలి” అని అన్నారు.

సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ “వృత్తిపరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ శ్రీ సరిపల్లి నాకు ఎప్పటినుండో ఫ్రెండ్. ఈ సినిమాలో నేను స్పెషల్ క్యారెక్టర్ చేశా. అందుకు శ్రీ, కార్తికేయ కారణం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శ్రీ చదువుకున్నాడు. అప్పటినుండి పరిచయం. అక్కడ హాలీవుడ్ స్టయిల్ నేర్చుకున్నాడు. ఇక్కడ, ఎక్కడ చేరతాడు? అని ఆసక్తిగా చూశా. వీవీ వినాయక్ గారి దగ్గర చేరాడు. ఆయన దగ్గర రెండు మూడు సినిమాలకు పని చేశాడు. హాలీవుడ్ స్టయిల్, టాలీవుడ్ స్టయిల్ మిక్స్ చేసి… న్యూఏజ్ కమర్షియల్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడు. సరికొత్త యాక్షన్ కామెడీ ‘రాజా విక్రమార్క’. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకుండా శ్రీ సినిమా చేశాడు. టీజర్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. కొత్త యాక్షన్ హీరోను పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటివరకూ కార్తికేయ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. 100 పర్సెంట్ నెక్స్ట్ లెవల్ కి వెళతాడు. ‘నువ్వు తోపురా’ చేసినపుడు సేమ్ బిల్డింగ్ లో ఉండేవాళ్ళం. అప్పటినుండి చూస్తున్నా… వినయంతో ఉంటాడు. విజయాలు వచ్చినా మనిషి మారలేదు. చాలా మంచి వ్యక్తి. సినిమా కోసం కష్టపడతాడు. కరోనా వల్ల ఏడాది ఆలస్యమైనా… ఆ లుక్, బాడీ అలాగే మైంటైన్ చేశాడు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. తమిళంలో అజిత్ గారితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయికుమార్ గారితో యాక్ట్ చేశాను. తనికెళ్ళ భరణి, పశుపతిగారు… మంచి టీమ్ తో నటించాను. నాకు అవకాశం ఇచ్చిన టీమ్ కి థాంక్స్. క్వాలిటీ విషయంలో ’88’ రామారెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 100 పర్సెంట్ సక్సెస్ కొడుతున్నాం. ‘రాజా విక్రమార్క’ మెగాస్టార్ చిరంజీవిగారి టైటిల్. మాకు ఆయన ఆశీర్వాదం కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది” అని అన్నారు.

నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కార్తికేయ. ఈ సినిమాకు ఆయన మూలస్థంభం. అందరి ఆశీర్వాదం సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నా” అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత ’88’ రామారెడ్డిగారికి, హీరో కార్తికేయకు… నాతో పని చేసిన మా టీమ్ అందరికీ థాంక్స్. మా ఆర్ట్ డైరెక్టర్, కెమెరామేన్, ఎడిటర్, నేను… మేమంతా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాం. మాకు కార్తికేయ అవకాశం ఇచ్చాడు. ఆయన పెట్టుకున్న అంచనాలను చేరుకుంటానని ఆశిస్తున్నాను. టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ పీసీ మౌళి, ఎడిటర్ జస్విన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా… సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #88 Rama Reddy
  • #Adi Reddy T
  • #Gemini Suresh
  • #Jabardhasth Naveen
  • #Kartikeya

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

8 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

8 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

8 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

8 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

8 hours ago

latest news

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

12 mins ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

25 mins ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

27 mins ago
‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

8 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version