త్రివిక్రమ్ మాత్రమే గొప్ప రైటర్ కమ్ దర్శకుడా.. హాట్ టాపిక్ గా మారిన హైపర్ ఆది స్పీచ్..!

నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో విశ్వక్ సేన్ ‘దాస్ క ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. విశ్వక్ సేన్ ఎప్పటిలానే తన ఆటిట్యూడ్ ను ప్రదర్శిస్తూ స్పీచ్ ఇచ్చాడు. వీళ్లిద్దరి స్పీచ్ లతో పాటు హైపర్ ఆది స్పీచ్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ మధ్య కాలంలో హైపర్ ఆది కూడా తన ఆటిట్యూడ్ ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది అందరికీ తెలిసిన సంగతే.

అయితే ఇతను ఏ వేడుకలో స్పీచ్ ఇచ్చినా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల భజన మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే నిన్నటి ఈవెంట్ లో ఎన్టీఆర్ వచ్చాడు గెస్ట్ కాబట్టి.. పవన్ కళ్యాణ్ గురించి ఆది మాట్లాడలేదు కానీ త్రివిక్రమ్ కు కాసేపు భజన చేశాడు. నిజానికి హైపర్ ఆది ఈ సినిమాలో కమెడియన్ గా చేశాడు. కానీ ఇతను స్పీచ్ మొదలుపెట్టడమే ‘దాస్ క ధమ్కీ’ చిత్రానికి కథ అందించిన రైటర్ ప్రసన్న కుమార్ తో మొదలుపెట్టాడు.

‘ఈ సినిమాకి కథ, డైలాగ్స్ మన ప్రసన్న కుమార్ బెజవాడ అందించాడు. ఓ నిర్మాత దర్శకుడి వల్ల లాభం పొందవచ్చు, హీరో వల్ల లాభం పొందవచ్చు, కానీ రైటర్ వల్ల కూడా లాభం పొందవచ్చు అని నిరూపించిన రైటర్ మన ప్రసన్న కుమార్ బెజవాడ. అతనికిచ్చే రెమ్యూనరేషన్లో ఒక రూపాయి ఆగొచ్చేమో కానీ, అతను ఇచ్చే స్క్రిప్ట్ లో ఒక్క డైలాగ్ కూడా ఆగడు. కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఇచ్చేస్తాడు.

ప్రసన్న కథ చెబుతున్నప్పుడు నిర్మాత ఓ చెక్ మీద 2 పక్కన ఓ సున్నా వేసి మొదలుపెడతాడు. అతను కథ చెప్పడం పూర్తయ్యాక నిర్మాత మిగతా 6 సున్నాలు కూడా వేసేస్తాడు. అంత కన్విన్సింగ్ గా కథ చెప్పగలడు ప్రసన్నకుమార్ బెజవాడ.’ అంటూ చెప్పుకొచ్చిన ఆది.. ఆ తర్వాత త్రివిక్రమ్ వైపు గేర్ వేసి.. ‘ఓ రైటర్ డైరెక్టర్ గా మారి ఎన్నో మంచి సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మనం చూశాం. ఆ తర్వాత ప్రసన్న కుమార్ బెజవాడ గారిని మనం చూడబోతున్నాం’ అంటూ భజన చేశాడు ఆది.

రైటర్లుగా పనిచేసి గొప్ప దర్శకులు అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. కొరటాల శివతో పోలిస్తే ఈ లిస్ట్ చాలానే ఉంది. అయినా ఆది త్రివిక్రమ్ భజన చేయడానికి అతని సినిమాల్లో అవకాశాల కోసం అన్నట్టే ఇలాంటి భజన చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా ప్రసన్న కుమార్ కూడా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఈజీగా ఉంది. ‘జబర్దస్త్’ బంధం కూడా తోడవుతుంది కదా.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus