Aadi, Akhil remuneration: ఆది కంటే అఖిల్ రెమ్యూనరేషన్ మరి అంత తక్కువా?

బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ సెలెబ్రెటీలుగా మారిపోయారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆదితో పాటు బుల్లితెర నటుడు బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ కూడా మెంటర్ గా సందడి చేస్తున్నారు.

ఇలా ఈ కార్యక్రమాలను మల్లెమాల వారు నిర్వహించడం విశేషం.ఇకపోతే మల్లెమాల వారి కార్యక్రమాలలో చేస్తున్న వారు ఎవరైనా ఒకసారి బయటకు వెళ్తే తిరిగి ఆ కార్యక్రమాలలోకి రావడం కష్టం కానీ ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి అఖిల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం కోసం వెళ్లారు. ఇలా ఈ కార్యక్రమానికి వెళ్లిన ఈయన తిరిగి బిగ్ బాస్ నుంచి రాగానే యధావిధిగా ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ వారానికి సుమారు రెండున్నర లక్షల పైగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం ఢీకార్యక్రమంలో కొనసాగుతూ ఉండగా ఈ కార్యక్రమం కోసం కూడా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని భావిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నందుకుగాను ఒక్కో కాల్ షీట్ కు అఖిల్ కేవలం లక్షన్నర రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హైపర్ ఆది మాత్రం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఒక్కో కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. హైపర్ ఆది ఈ కార్యక్రమంలో సందడి చేసినందుకు ఏకంగా జడ్జెస్ తో సమానంగా ఒక్క కాల్ షీట్ కు 5 లక్షలు తీసుకోవడం విశేషం

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus