Hyper Aadi: రోజాతో విబేధాలపై నోరు విప్పిన హైపర్ ఆది.. ఆమె మాట్లాడేవారు కాదంటూ?
- February 14, 2024 / 03:46 PM ISTByFilmy Focus
బుల్లితెర షోల ద్వారా, సినిమాల ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది వేర్వేరు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు రోజాతో హైపర్ ఆదికి విబేధాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన తరపున హైపర్ ఆది పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఒక ఇంటర్వ్యూ ద్వారా హైపర్ ఆది అన్ని ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు.
వృత్తి వేరు రాజకీయాలు వేరని జబర్దస్త్ షో సక్సెస్ కావడం వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని ఆది తెలిపారు.
జబర్దస్త్ షో సమయంలో రోజాగారు ఎంతో ప్రోత్సహించారని జబర్దస్త్ షో సెట్స్ లో రోజా గారు రాజకీయాలకు సంబంధించి ఎప్పుడూ ప్రస్తావించలేదని ఆది చెప్పుకొచ్చారు. రోజా ఇష్టపడే వ్యక్తులు నేను అభిమానించే వ్యక్తులు వేరని ఆది కామెంట్లు చేశారు. పవన్ అంటే నాకు అభిమానమని పవన్ సిద్ధాంతాలు అంటే నాకు ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ ను ఎవరైనా ఏదైనా అంటే తాను స్పందిస్తానని పవన్ కళ్యాణ్ సమస్యల గురించి ప్రస్తావిస్తారే తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ దూషించరని హైపర్ ఆది అభిప్రాయపడ్డారు.

పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని నేను ఫీలవుతున్నానని ఆయన నుంచి నేను పదవులు ఆశించడం లేదని ఆది పేర్కొన్నారు. జనసేన తరపున ప్రచారం చేస్తానని పవన్ ఆదేశితే మాత్రం పోటీ చేసి గెలిచి పవన్ ను గెలిపిస్తానని హైపర్ ఆది వెల్లడించారు. హైపర్ ఆది ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న వేర్వేరు షోలలో పాల్గొంటూ ఆ షోల సక్సెస్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

హైపర్ ఆది (Hyper Aadi) రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. హైపర్ ఆది రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. హైపర్ ఆది 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. హైపర్ ఆది కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!
















