“ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం” అనే డైలాగ్ పాలిటిక్స్ లో చాలా పాపులర్. అంటే అవసరం బట్టి రాజకీయ నాయకులు కండువాలు, పార్టీలు మార్చేస్తుంటారని అర్థం. ఆ తర్వాత కాలంలో ఆ డైలాగ్ మన సినిమా సెలబ్రిటీల విషయంలో కూడా ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కండువాను మోయడం అలవాటు చేసుకున్నారు మన సినిమా సెలబ్రిటీలు. ఏమాత్రం మొహమాటపడకుండా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడిని తెగ మోసేస్తుంటారు.
Rocking Rakesh
కేటీఆర్ ఇందుకు ఉత్తమమైన నిదర్శనం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేటీఆర్ పుట్టినరోజుకు ప్రతి ఏడాది టంచనుగా సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేవారు మన తెలుగు సినిమా సెలబ్రిటీలు. కట్ చేస్తే.. ప్రభుత్వం అధికారం కోల్పోయిన కొన్ని నెలల్లోనే కేటీఆర్ పుట్టినరోజు రాగా, కనీసం పది మంది కూడా కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. అలా ఉంటుంది ఇండస్ట్రీలో పవర్ ప్లే.
అయితే.. “జబర్దస్త్” షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ తన కొత్త సినిమా కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) ట్రైలర్ ను నిన్న విడుదల చేసారు. ఆ ప్రెస్ మీట్ లో పాత్రికేయుల ప్రశ్నల్లో భాగంగా “ఇప్పుడు అధికారంలో లేని కెసిఆర్” అభిమాని అని చెప్పుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉందా?” అని అడగగా.. రాకేష్ (Rocking Rakesh) వెంటనే “నేనెందుకు భయపడాలి, అధికారం లేనంతమాత్రాన మనిషి పేరు చెప్పుకోలేమా?” అని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒక సాధారణ కమెడియన్ ఇలా రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకోవడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కెసిఆర్ అభిమానిగా రాకేష్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఓ సెన్సిబుల్ విషయానికి రాజకీయ నేపథ్యం కలిపి తెరకెక్కించిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు రాకేష్ (Rocking Rakesh) . మరి హీరోగా అతడికి కెసియార్ ఏమేరకు సహాయపడుతుందో చూడాలి.
I am Rakesh Brother fan now
Because, only the guts to talk like this will become a KCR fan