“నేను ఒక స్టార్ గా గుర్తింపు పొందుతున్నానంటే అది నాన్న (చిరంజీవి), బాబాయ్(పవన్ కళ్యాణ్) వల్లే. వాళ్ళే లేకుంటే నేనే లేను” అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చెప్పారు. విజయనగరంలోని చెరుకుపల్లి అవంతి ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో చెర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. “ఎవరినైనా స్టార్ ని చేయాలన్న, లీడర్ ని చేయాలన్న అది విద్యార్థుల చేతుల్లోనే ఉంది. నాయకుడు దుర్మార్గపు పనులు చేస్తుంటే అతన్ని దించే శక్తి కూడా స్టూడెంట్స్ కి ఉంది” అని చెప్పారు.
అందుకే షూటింగ్ కి రెండేళ్లు విరామం ఇచ్చి విద్యార్థిగా కాలేజీకి వెళ్లాలని ఉందని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. “ఇప్పటికే ధృవ, ఖైదీ నంబర్ 150 సినిమాలను మీరు హిట్ చేయడంతో.. ఆ ఉత్సాహంతో కాటమరాయుడు చిత్రంతో వస్తున్నాం. ఈ మూవీ ట్రైలర్ చూసాను. ఫెంటాస్టిక్ గా ఉంది. ఈ సినిమా కూడా రికార్డులను బ్రేక్ చేస్తుంది” అని బాబాయ్ చిత్రంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.