డార్లింగ్ అంటే ఇష్టమని చెప్పిన క్రీడాకారిణి గుత్తా జ్వాలా
- November 21, 2016 / 11:44 AM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ. అతన్నే పెళ్లి చేసుకోవాలని కొంతమంది అమ్మాయిలు కలలు కంటుంటే , మరికొంతమంది అతనిలాంటి అబ్బాయిని భర్తగా రావాలని కోరుకుంటున్నారు. రెండో కేటగిరీల్లో తాజాగా గుత్తా జ్వాలా కూడా చేరింది. ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గతంలో ప్రభాస్ తన అభిమాన హీరో అని మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే. గుండెజారి గల్లంతయింది చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన ఈమె డార్లింగ్ సరసన యాక్షన్ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కూడా వెల్లడించింది.
ఆ తర్వాత ఆమె టోర్నమెంటులో బిజీ కావడంతో సినిమాల్లో మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు ప్రభాస్ లాంటి వ్యక్తిని పెళ్లిచేసుకోవాలనుకున్నట్లు తన మనసులోని మాటను బయట పెట్టింది. గుత్తా జ్వాలకి ఇదివరకే తోటి క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తో పెళ్లి అయింది. 2005 లో ఒకటైన వీరిద్దరూ 2011 లో డైవర్స్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న గుత్తా జ్వాలా యంగ్ రెబల్ స్టార్ ల్లాంటి అందగాడు, మంచి మనసున్న వాడు దొరికితే మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాకు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో గుత్తా జ్వాలా చెప్పింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















