సంగీత ప్రపంచంలో ఇళయరాజా (Ilaiyaraaja) ఒక లెజెండ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా మూడు తరాల వారికి ఆయన సంగీతం ఒక మంచి అనుభవంగా నిలుస్తోంది. ఇక ఇళయరాజా మ్యూజిక్ లో వచ్చిన పాటలు శాశ్వతంగా సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోతాయి. పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయనకు గల ఫ్యాన్ బేస్ కు లెక్కేలేదు. 1500కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన, 7000కు పైగా పాటలను అందించారు. అంతేకాదు, కేవలం 35 రోజుల్లో సింపోనిని కంపోజ్ చేయగల సామర్థ్యం తనకుందని నిరూపించుకున్నారు.
Ilaiyaraaja
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇళయరాజా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను మ్యూజిక్ కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశానని, మొజార్ట్, బచ్చ్, బీతోవెన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులను భారతీయులకు తానే పరిచయం చేశానని పేర్కొన్నారు. “నా సంగీతం వినడమే ఓ కళ! నా సంగీతానికి మాత్రమే కాదు, నా ప్రతిభకు నేను గర్వపడతా. నేను సాధించిన ఘనతను మరెవరు సాధించలేదు,” అని చెప్పిన ఆయన, “నాకు పొగరు కూడా ఉంది, ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరు ఉంటుంద,” అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఇళయరాజా తన సంగీతంపై గల అద్భుతమైన విశ్వాసాన్ని మరోసారి రుజువు చేశారు. “నా సంగీతం విని ఓ చిన్నారి తిరిగి శ్వాస తీసుకుంది,” అని చెప్పిన ఆయన, “ఒకసారి ఏనుగుల గుంపు నా పాట వినడానికి వచ్చాయి,” అనే వింత అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో విమర్శలకు గురవుతున్నప్పటికీ, ఇళయరాజా మాటల్లోని నమ్మకం, ఆయన సాధించిన ఘనతను గుర్తించే అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
అలాంటి ఓ వ్యక్తి తన ప్రతిభ గురించి గర్వంగా చెప్పుకోవడం తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇళయరాజా మాటలు తన సంగీత ప్రయాణంలో ఎన్నో గొప్ప విషయాలను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరికి ఆయన గర్వంగా మాట్లాడినట్టు అనిపించగా, మరికొందరికి ఆయన నిజాయితీగా తన ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టినట్టుగా అనిపించింది. “ఇళయరాజా సంగీత ప్రపంచానికి అందించిన సేవలతో ఆయన్ను ఎవరూ పోల్చలేరు” అని ఆయన అభిమానులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.