Sonu Sood: సోనూ పై కన్నేసిన ఐటీ అధికారులు.. ఇల్లు, ఆఫీసుల్లో దాడులు..!

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది. ముంబైలో ఉన్న సోనూసూద్ ఇంట్లో ఐటీ దాడులు జరిపారు అధికారులు. అంతేకాదు సోనూ ఆఫీసులో కూడా తనిఖీలు జరిగాయి. సోనూసూద్ ఫోన్లను కూడా లాగేసుకున్నట్టు వినికిడి. ఇంత సడెన్ గా ఐటీ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించడంతో అతను షాక్ కు గురయ్యాడు. ఉన్నట్టుండి అతని ఇల్లు, ఆఫీస్ ల పై ఇలాంటి దాడులు జరగడమేంటి..?

దీని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా? అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ కార్యక్రమానికి సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌ ను చేసింది.కరోనా లాక్ డౌన్ టైములో సోనూ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. సినిమాల్లో విలన్ గా చేస్తున్నప్పటికీ నిజజీవితంలో రియల్ హీరో సోనూ అంటూ ప్రజలు కొనియాడారు. వలస కార్మికులను వారి గమ్య స్థలాలకు చేర్చాడు.

అందుకోసం ఏకంగా విమానాలను, రైళ్లు కూడా వేయించడం గమనార్హం.అటు తర్వాత పేద రైతులను ఆదుకున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు కూడా.! రాజకీయాల్లో చేరే ఆలోచన కూడా అతనికి లేదని స్పష్టంచేశాడు.అయితే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అతనికి అంత డబ్బు ఎలా వచ్చింది అనే అంశం పై ఈ దాడులు నిర్వహించింది ప్రభుత్వం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.