క్రికెట్‌లో ఓ నానుడి ఉంటుంది.. దానిని సినిమాలకు కూడా బాగా వాడేయొచ్చు. ఎందుకంటే అంతగా యాప్ట్ అవుతుంది కాబట్టి. కావాలంటే ఈ వార్త చదవండి మీకు కూడా అర్థమవుతుంది. ముందు నానుడి చెప్పి.. ఆ తర్వాత దాని వాడకం గురించి చూద్దాం. ‘ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్’.. అంటే ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది’ అని. మన సీనియర్ దర్శకులు చాలామంది దర్శకులు ఇదే కాన్సెప్ట్‌లు సినిమాలు చేసి వావ్ అనిపిస్తుంటారు. వాళ్లకు అలాగే అవకాశాలు కూడా వస్తుంటాయి.
కావాలంటే మీరే చూడండి.. రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత కూడా మోహన్ కృష్ణ ఇంద్రగంటికి అదిరిపోయే సినిమా ఒకటి వచ్చింది అని అంటున్నారు. దీనికి నిర్మాత ఎవరో కాదు దిల్ రాజు. అవును ఆయనే గతంలో ఇంద్రగంటి సినిమా వల్ల ఇబ్బంది పడిన దిల్ రాజే ఇప్పుడు కొత్త సినిమాను రూపొందించడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజిలో ఉంటుంది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
కొందరు దర్శకులపై డిజాస్టర్ల ప్రభావం పడదు అంటుంటారు. అలాంటివారిలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒకరు. ఇదే క్రమంలో ఆయన ‘జటాయువు’ అనే సినిమాను దాదాపు ఓకే చేసుకున్నారు అంటున్నారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రస్తావన వచ్చింది కానీ.. హీరో తదితర వివరాలు గురించి మాట్లాడలేదు. అయితే ఆ హీరో విజయ్ దేవరకొండ అని అంటున్నారు. ‘జటాయువు’ సినిమా కథ విజయ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారట. అలాగే దిల్ రాజు కూడా చేశారట.
దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ‘జటాయువు’ ఉంటుంది అంటున్నారు. ఈ క్రమంఓల (Indraganti) ఇంద్రగంటి స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారట. విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఎక్కువగా ఉన్న ఈ సినిమాకు సరైన విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ పెట్టుకుంటున్నారట. గతంలో ఈ విషయంలో ఇంద్రగంటి కాస్త ఇబ్బందిపడ్డారు, చూసిన జనాల్ని ఇబ్బందిపెట్టారు కూడా.