లతా మంగేష్కర్ మరణ వార్త విని ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారనే సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ తన సినీ కెరీర్ లో 27,000కు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ అసలు పేరు హేమ కాగా కొన్ని కారణాల వల్ల ఆమె పేరు లతగా మారింది. తెలుగులో లతా మంగేష్కర్ తక్కువ పాటలే పాడినా ఆ పాటలు హిట్ గా నిలిచాయి. లత పాడిన తెలుగు పాటలను సులభంగా మరిచిపోలేము.
లతా మంగేష్కర్ ఇండోర్ లో జన్మించారు. లతా మంగేష్కర్ తల్లిపేరు శేవంతీ మంగేష్కర్ కాగా తండ్రి పేరు దీనానాథ్ మంగేష్కర్. 13 సంవత్సరాల వయస్సులో ఒక మరాఠీ సినిమా కోసం తొలిసారి లతా మంగేష్కర్ పాట పాడారు. 1942 సంవత్సరంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ బాధ్యతలు ఆమెపై పడ్డాయి. 2015 సంవత్సరం వరకు గాయనిగా లతా మంగేష్కర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో రూపాయి కూడా తీసుకోని ఎంపీగా లతా మంగేష్కర్ వార్తల్లో నిలిచారు.
మదన్ మోహన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ లతా మంగేష్కర్ కు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. లతా మంగేష్కర్ కు క్రికెట్ ఇష్టమైన ఆట కాగా లార్డ్స్ స్టేడియంలో ఆమెకోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఉంది. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న గాయనీమణులలో లతా మంగేష్కర్ కూడా ఒకరు. 1990 సంవత్సరంలో లతా మంగేష్కర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. 1962 సంవత్సరంలో ఒక పాట ద్వారా నెహ్రూ చేత లతా మంగేష్కర్ ప్రశంసలను అందుకోవడం గమనార్హం.
చైనా యుద్దంలో ఓడిపోయిన జవానులను ఉద్దేశిస్తూ లతా మంగేష్కర్ పాట పాడారు. 1953 సంవత్సరంలో లతా మంగేష్కర్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రాగా మొదట లతా మంగేష్కర్ ఆ అవార్డును తిరస్కరించారు. లతా మంగేష్కర్ తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.