బాహుబలి2 సినిమా కలెక్షన్ల విషయంలో సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. బాహుబలి2 కలెక్షన్లను చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఓవర్సీస్ లో సైతం బాహుబలి2 కనీవిని ఎరుగని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి2 సినిమాను మించి కలెక్షన్లను సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం బాహుబలి2 రికార్డులను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేయడం కష్టమేనని సమాచారం. ఆర్ఆర్ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం ప్రభావం ఈ సినిమా కలెక్షన్లపై కూడా ఊహించని స్థాయిలో పడనుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఫైనల్ కట్ సిద్ధం కాగా రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. వరుసగా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు. త్వరలో ఆర్ఆర్ఆర్ రెగ్యులర్ ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు యూఎస్ లో పెద్దలకు 23 డాలర్లు, పిల్లలకు 18 డాలర్లుగా టికెట్ రేట్లు ఉండనున్నాయి. ఐమాక్స్ డాల్బీ సినిమాస్ లో పెద్దలకు 30 డాలర్లు, పిల్లలకు 23 డాలర్లుగా ఉండనున్నాయి.
ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ వెర్షన్లకు టికెట్ రేట్లు మరింత తక్కువగా ఉండనున్నాయని సమాచారం. ఈ రేట్లలో బాహుబలి2 ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. బాహుబలి2 11 మిలియన్ల కలెక్షన్లను సాధించగా ఆర్ఆర్ఆర్ ఆ కలెక్షన్లను మించి కలెక్షన్లు సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.