Pushpa Movie: బన్నీ వెన్నంటే ఉండే కేశవ బ్యాగ్రౌండ్ తెలుసా?

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కి విడుదలైన పుష్ప ది రైజ్ తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బన్నీ కలెక్షన్లతో కొత్త రికార్డులు సాధిస్తుండగా టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం షాకవుతున్నారు. అఖండ సక్సెస్ పుష్ప మూవీతో కంటిన్యూ అయిందని బన్నీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కేశవ అనే పాత్రలో బన్నీ పక్కన చేసిన వ్యక్తి అద్భుతంగా నటించాడనే సంగతి తెలిసిందే.

సాధారణంగా సినిమాలో హీరో పక్కన నటించే పాత్రల కోసం దర్శకులు పేరున్న నటులను తీసుకుంటారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం ప్రతిభ ఉన్నవాళ్లకు తన సినిమాలలో అవకాశాలను ఇస్తున్నారు. కేశవ పాత్రలో నటించిన వ్యక్తి పేరు జగదీష్ ప్రతాప్ బండారి. పలాస 1978, మల్లేశం సినిమాలలో ప్రతాప్ బండారి చిన్న పాత్రలలో నటించి మెప్పించారు. అయితే ఆ రెండు సినిమాలు చిన్న సినిమాలు కావడంతో ప్రతాప్ బండారికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడం గమనార్హం. ఫుల్ లెంగ్త్ రోల్ లో సహజంగా నటించి ఈ నటుడు సుకుమార్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు మారుమ్రోగుతుండగా ఈ సినిమా తర్వాత ప్రతాప్ కు ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.

వరంగల్ కుర్రాడు అయిన ప్రతాప్ బండారి కొత్త పోరడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. కేశవ రోల్ చేయడానికి బన్నీ, సుకుమార్ ఎంతగానో ప్రోత్సహించారని ప్రతాప్ బండారి చెప్పుకొచ్చారు. సినిమా విడుదలైన తర్వాత వస్తున్న ప్రశంసల వల్ల చాలా సంతోషంగా ఉందని ప్రతాప్ బండారి పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్లు ప్రోత్సహిస్తే ప్రతాప్ బండారి కెరీర్ పరంగా ఎదిగే ఛాన్స్ ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus