శ్రీకాంత్, రవళి హీరో హీరోయిన్లుగా ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినోదం’. 1996వ సంవత్సరం ఆగష్ట్ 2న విడుదలైన ఈ చిత్రాన్ని ‘మనీషా ఫిలిమ్స్’ బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మించడమే కాకుండా దీనికి కథని కూడా అందించారు. నిన్నటితో ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు పూర్తయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఆ టైములో ఘన విజయాన్ని సాధించింది.నిర్మాత పెట్టిన పెట్టుబడికి.. మూడింతలు రాబట్టింది ఈ చిత్రం. మొదటి వారం జనాలు సోసో గా థియేటర్ కు వెళ్లినా.. రెండో వారం నుండీ ఓ స్టార్ హీరో సినిమాకి వెళ్లినట్టు ఎగబడ్డారు.
క్లాస్,మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుడు కొన్న టికెట్ కి 100 శాతం న్యాయం చేసిన చిత్రమిది.శ్రీకాంత్ ను హీరోగా మరో మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో ఆరోగ్యకరమైన కామెడీ ఉండడం లేదు. ‘ఓ బూతు లేకుండా కామెడీ సృష్టించడం కష్టం’ అని చెప్పిన త్రివిక్రమ్ వంటి బడా డైరెక్టరే.. డబుల్ మీనింగ్ డైలాగులను నమ్ముకుంటూ కామెడీ చేస్తున్నాడు.ఇక ‘జబర్దస్త్’ స్కిట్ లను ‘టిక్ టాక్’ వీడియోలను, వాట్సాప్ ఫార్వార్డెడ్ మెసేజ్ లను నిండా నింపేసిన ‘జాతి రత్నాలు’ వంటి చిత్రాన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను చేశారు.దీనికి కారణం ప్రేక్షకులు కామెడీకి కరువయ్యే అని చెప్పడంలో సందేహం లేదు.
అయితే ‘వినోదం’ మూవీ ఇప్పుడొచ్చే సినిమాలకు 10 రెట్లు కామెడీ పంచుతుంది అనడంలో సందేహం లేదు.అందుకే ప్రేక్షకులు ఇప్పటికీ ఈ మూవీని బుల్లితెర పై చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ‘వినోదం’ మూవీలో బ్రహ్మానందం ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పడి పడి నవ్వేలా కామెడీ పండిస్తాడు. ఇక ఎ.వి.ఎస్, తనికేళ్ల భరణి,మల్లికార్జున రావు వంటి వారు పోటీపడి మరీ కామెడీ పండించారు. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతంలో రూపొందిన పాటలు, నేపధ్య సంగీతం కూడా సూపర్ గా కుదిరింది. డౌట్ గా ఉంటే.. ఇంకోసారి ఈ మూవీని చూడండి.. మీకే అర్ధమవుతుంది.