క్రౌడ్ ఫండింగ్.. సినిమాల్లో ఇప్పుడు ఈ మాట పెద్దగా వినిపించడం లేదు కానీ. కరోనా పరిస్థితులకు ముందు కొంతమంది ఇలా కలసి ఓ సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు అలా వచ్చాయి కూడా. అయితే దేశంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా రూపొంది, విడుదలై మంచి విజయం కూడా అందుకుంది. అది కూడా ఈ మధ్య కాదు ఏకంగా 46 ఏళ్ల క్రితం జరిగింది. ఆ సినిమా ‘మంథన్’. విఖ్యాత దర్శకుడు శ్యామ్ బెగనల్ తెరకెక్కించిన చిత్రమిది.
‘మంథన్’ సినిమాకి ఏకంగా ఐదు లక్షల మంది నిర్మాతలు ఉన్నారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసి.. శ్వేత విప్లవ పితామహుడిగా ఖ్యాతి గాంచిన వర్గీస్ కురియన్ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వర్గీస్ కురియన్ రాకతో గుజరాత్ పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి అని చెప్పొచ్చు. దీంతో ఆయన జీవితం మీద తెరకెక్కుతున్న సినిమా నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారట. దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఈ మేరకు ఆలోచన చేయగా… గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చింది.
సినిమాలో భాగస్వాములుగా ఉన్న ఐదు లక్షల మంది రైతులు 2 రూపాయల చొప్పున ఇచ్చారట. ప్రపంచంలో ఇంత ఎక్కువ మంది నిర్మించిన తొలి క్రౌండ్ ఫండింగ్ సినిమాగా ‘మంథన్’ సినిమా ఆ రోజుల్లో రికార్డు సృష్టించిందట. మన దేశంలో అయితే ఇదే తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇక ఇదంతా సినిమా ప్రారంభానికి ముందు జరిగింది. సినిమా విడుదల తర్వాత సినిమాను విజయవంతం చేయాలని అప్పట్లో రైతులు ఎద్దుల బళ్లపై గుంపులు గుంపులుగా థియేటర్లకు తరలివచ్చారట.
ఈ సినిమాలో గిరీశ్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పురి, స్మితా పాటిల్, కుల్‌భూషణ్ కర్బందా, మోహన్ అగశే, అనంత్ నాగ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం (హిందీ) పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. విజయ్ టెండుల్కర్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం లభించింది. ఇందులో ఉన్న ఏకైక పాట ‘మేరో గామ్ కథ పారే..’ అనే పాట పాడినందుకుగాను ప్రీతి సాగర్‌కు ఫిలిం ఫేర్ పురస్కారం లభించింది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!