‘తేడా సింగ్’… ఈ పేరు భలే గమ్మత్తుగా ఉంది కదా. అంతే కాదు ఎక్కడో విన్నట్లుంది కదా. ‘పైసా వసూల్’ సినిమాలో నందమూరి బాలకృష్ణకు పూరి జగన్నాథ్ పెట్టిన పేరు ఇది. సినిమా ఈ పేరు వినిపించినప్పుడు ఫన్ భలే జనరేట్ అయ్యింది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా సిద్ధం కాబోతోందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పూరి – బాలయ్య కాంబినేషన్‌లోనే ఆ సినిమా ఉండబోతోందట.
హీరోల క్యారెక్టరైజేషన్ల యందు పూరి జగన్నాథ్ హీరోల పాత్ర చిత్రణ వేరయా అంటుంటారు సినిమా పరిశీలకులు. హీరో ఎవరైనా… ఇమేజ్ ఎలాంటిదైనా… అందులో పూరి మార్క్ యాడ్ చేసి వావ్ అనిపిస్తుంటారు. అలా వచ్చింది తేడా సింగ్. ఆ పాత్ర నైజం, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఆ సినిమా సరైన విజయం ఇవ్వకపోయినా అభిమానులకు మాత్రం తేడా సింగ్ సూపర్. ఇప్పడు అదే మేనరిజాన్ని కంటిన్యూ చేస్తే, ఆ పాత్ర చుట్టూ ఓ కథను సిద్ధం చేస్తున్నారట పూరి జగన్నాథ్.
అన్నీ కుదిరితే ‘లైగర్’ తర్వాత ఈ సినిమానే పట్టాలెక్కొచ్చు అని కూడా వార్తలొస్తున్నాయి. దీనిని మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు ‘తేడా సింగ్’ అనే పేరే పెడతారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం.. ‘తేడా సింగ్ 2’ ఎలా ఉంటాడో.