ఆదివారం ఉదయం లేవగానే.. ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ అంటూ పవన్ కల్యాణ్ అభిమానులను పలకరించారు మైత్రీ మూవీ మేకర్స్ టీమ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. కాసేపటికి ఈ రోజే సినిమా ముహూర్తపు షాట్ అని మరో షాక్ ఇచ్చారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడు.. ఇదేదో మిక్స్‌డ్ పోస్టర్‌లా అనిపించింది. అంటే ‘భవదీయుడు భగత్ సింగ్’ పోస్టర్‌కు ఇంకో సినిమా పోస్టర్‌ను కలిపినట్లు ఉంది. అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. పోస్టరే కాదు.. సినిమా కూడా అలా మిక్సరే అని అంటున్నారు.
హరీశ్ శంకర్ – పవన్ కల్యాణ్ సినిమా ఆగిపోయిందా? అంటూ ఇన్నాళ్లూ బాధపడిన అభిమానులు… శుక్రవారం నుండి మాత్రం వేరే బాధపడ్డారు. ‘తెరి’ సినిమా రీమేక్ బాధ్యతలు హరీశ్ శంకర్‌కు ఇచ్చారనేది వారి బాధ. స్ట్రయిట్ మూవీ తీస్తాడు అనుకుంటే.. ‘తెరి’ రీమేక్ చేస్తారా అనేది వాళ్ల కష్టం. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి. దీంతో రీమేక్ వద్దంటూ పెద్ద ఎత్తున ట్రెండింగే జరిగింది. ఫైనల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లాప్ బోర్డు మీద ‘రచన – దర్శకత్వం: హరీశ్ శంకర్’ అని కనిపించే సరికి ఇది రీమేకే అని ఫిక్స్ అయ్యారు.
This time It`s not just entertainment అంటూ ఇంతకుముందు ‘భవదీయుడు భగత్‌సింగ్’ పోస్టర్ మీద ఉన్న క్యాప్షనే ఇందులోనూ కనిపించింది. ముందు అనుకున్న కథనే తీస్తుంటే టైటిల్ ఎందుకు ప్రకటించారన్నది అర్థం కాని విషయం. అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. ‘దబంగ్’ సినిమాను ‘గబ్బర్ సింగ్’గా మార్చిన తరహాలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు చేశారట హరీశ్ శంకర్. ‘తెరి’ కథ ఫస్టాఫ్‌ను ఈ మేరకు మారుస్తున్నారని చెబుతున్నారు. అలా ‘తెరి’ రీమేక్‌నే.. మార్చి ‘ఉస్తార్ భగత్ సింగ్’ చేశారట.
‘తెరి’ సినిమా ఫస్ట్ హాఫ్‌లో విజయ్ బేకరీ ఓనర్ పాత్రలో కనిపిస్తాడ. ఇక్కడ పవన్ కాలేజీ లెక్చరర్‌గా ఉంటాడట. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎపిసోడ్ అలాగే ఉంటుందట. అయితే దానికి హరీశ్ శంకర్ స్టైల్ టచ్‌లు ఉంటాయట. ఇప్పటివరకు సినిమా గురించి టీమ్ ఎక్కడా అఫీషియల్‌గా ఏమీ చెప్పలేదు. కానీ ఈ రీమేక్ పోస్టర్.. ఆ రీమేక్ గురించే అని ఫిక్స్ అవ్వొచ్చు అంటున్నారు.