పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ : సీజ్ ఫైర్’ అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.’హోంబలే ఫిలిమ్స్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. డిసెంబర్ 22 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి.
కానీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది అంటూ ఏమీ లేదు. అయితే అతి త్వరలో రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందట, అది సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది అని చిత్ర బృందం భావిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. కొంచెం వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ మూవీకి సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు ఇన్సైడ్ టాక్. అలాగే రన్ టైం 2 గంటల 55 నిమిషాల వరకు వచ్చిందని సమాచారం.
ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం సినిమా (Salaar) అబౌవ్ యావరేజ్ అనే విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక 2 గంటల 55 నిమిషాల్లో.. హీరో ప్రభాస్ మొదటి 40 నిమిషాల వరకు కనిపించడు అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ 3 నిమిషాల వరకు ఉంటే, అందులో 2 నిమిషాల వరకు ప్రభాస్ కనిపించడు. దానిని బట్టి నిజమే అయ్యుండొచ్చు అనే ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుంది.