హీరో పాత్రకు ఏదైనా చిన్నపాటి శారీరక లోపం ఉంటే… సినిమా హిట్ అంటుంటారు. ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. హిట్ కోసం అలా రాస్తారో లేక పాత్ర బరువు పెంచడానికి అలా రాస్తారో తెలియదు కానీ… ఆ టైప్ కథలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ‘లైగర్’ కోసం పూరి జగన్నాథ్ అలాంటి పంథానే ఎంచుకున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. టైగర్ + లయన్ కలిపి క్రాస్ బ్రీడ్ ‘లైగర్’ అంటూ…
సినిమా పేరును ప్రకటించినప్పటి నుండి సినిమా మీద అంచనాలు అమాంతం డబుల్ అయిపోయాయి. ఇప్పుడు బయటికొచ్చిన ఈ విషయం కూడా నిజమైతే ‘లైగర్’ పాత్రపై అంచనాలు వాటికి డబుల్, ట్రిపుల్ అయిపోతాయి. అదే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి ఉన్న కుర్రాడిగా కనిపిస్తాడట. దీంట్లో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ.. అదే జరిగితే లైగర్ పాత్ర సూపర్ ఉంటుంది అని చెప్పొచ్చు. మామూలుగా తెలుగు సినిమాల్లో నత్తి ఉన్న హీరో పాత్రను కామెడీ కోసం వాడుతుంటారు.
అలాంటి డిసెబిలిటీని సీరియస్ పాత్రల్లో చూపిస్తే ఎలా ఉంటుందో ‘లైగర్’లో చూడొచ్చు అంటున్నారు. ఓ బాక్సర్‌కి నత్తి అనే డిసెబిలిటీ పెట్టారు అంటే.. దాని వెనుక ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండుతాయి అంటున్నారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కేపబిలిటీ ఏంటో ఇప్పటికే చూశాం. ఇప్పుడు ఈ నత్తి పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ‘ఎఫ్ 3’ సినిమాలో వరుణ్‌తేజ్ పాత్ర కూడా కొంచెంకొంచెం నత్తిగానే సాగుతుంది. ఇప్పుడు ‘లైగర్’లో విజయ్ పాత్ర అలానే ఉండబోతోంది.
యాక్షన్, హై ఓల్టేజ్ సీన్స్‌ని కామెడీతో మిక్స్ చేసి రాయడం పూరి జగన్నాథ్‌కి అలవాటు. ఇప్పుడు ‘లైగర్’లో ఎలా రాశారో తెలియాలంటే ఆగస్టు 25న తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజే సినిమా విడుదలయ్యేది. అన్నట్లు చెప్పలేదు కదా ఈ సినిమాలో కథానాయికగా అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా ఆఖరున విజయ్‌తోనే ‘జేజీఎం’ అనౌన్స్ చేశారు పూరి. శివ నిర్వాణ ‘ఖుషి’ అయిపోయాక ఈ సినిమా స్టార్ట్ చేస్తారని టాక్.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!