Katrina Kaif Pregnant: కత్రీనా ప్రెగ్నెన్సీ .. వీడియోతో క్లారిటీ వచ్చినట్టేనా?

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ (Katrina Kaif ) -విక్కీ కౌశల్ (Vicky Kaushal) ..లకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2021 నవంబర్ 9న వీరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అనే వార్తలు ఊపందుకున్నాయి.

బాలీవుడ్ మీడియా ఈ విషయం పై కోడై కూస్తోంది. కత్రీనా.. సుఖ ప్రసవం కొరకు లండన్లోని టాప్ హాస్పిటల్స్ కి వెళ్లినట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. అది నిజమా కాదా అనే డైలమాలో చాలా మంది ఉన్నారు. అయితే అది నిజమే అన్నట్టుగా.. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. లండన్ వీధుల్లో విక్కీ- కత్రీనా..లు టైం పాస్ చేస్తున్నారు. అయితే భార్యని విక్కీ క్షేమంగా ఓ రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నట్లు ఆ వీడియో స్పష్టం చేసింది.

ఇందులో కత్రీనా కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ పై వార్తలు మరింత ఊపందుకున్నాయి అని చెప్పాలి. కానీ విక్కీ- కత్రీనా..లు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది లేదు. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను అంత సీక్రెట్ గా ఉంచరు. వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు. మరి కత్రీనా- విక్కీ..లు ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus