Allu Arjun: కోలీవుడ్‌ స్టార్స్‌ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్‌!

సినిమా అంటే ఒకరి పని కాదు, ఒక రోజు పని కాదు. కొన్ని రోజులపాటు… తెలిసిన, తెలియనివాళ్లంతా కలసి చేసే యజ్ఞం. అందుకే సినిమా వాళ్లు షూటింగ్‌ పూర్తయిన ఆఖరి రోజు చాలా భావోద్వేగానికి లోనవుతుంటారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చూశాం. ఈ క్రమంలో కొందరు కన్నీటి బొట్లు ద్వారా తమ ఫీలింగ్స్‌ చెబుతారు. సినిమా టీమ్‌ను స్నేహితులిగా మలుచుకుంటారు. కోలీవుడ్‌లో అయితే యువ హీరోలు సినిమాలో కీలక సభ్యులకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ఇప్పుడు ఈ సంస్కృతి టాలీవుడ్‌కి కూడా వచ్చిందంటున్నారు.

‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్‌ ఈ పని చేస్తున్నాడట. నిజానికి కొన్ని రోజుల క్రితమే ఇలాంటి ఓ మాట బయటకు వచ్చింది. సినిమాలో కీలక సభ్యులకు ఉంగరాలు ఇస్తున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడవి ఉంగరాలు కాదు… బంగారు బిస్కెట్లు అంటున్నారు. అంతేకాదు ఆ బిస్కెట్ల మీద ఒకవైపు పుష్ప అని ఉంటే… ఇంకోవైపు AA అని అల్లు అర్జున్‌ లోగో ఉంటుందని వార్తలొస్తున్నాయి. పైన చెప్పినట్లు కోలీవుడ్‌లో ధనుష్, విజయ్‌ ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తుంటారు.

తమిళనాట అయితే, సినిమా ఆఖరి రోజు పెద్ద గ్రూప్‌ ఫొటో తీసుకొని, ఆ తర్వాత మంచి పార్టీ చేసుకొని గిఫ్ట్‌లు ఇస్తుంటారు. మరి ఇప్పుడు బన్నీ ఏం చేస్తాడో చూడాలి. అయితే ఆ ఉంగరాలు, బిస్కెట్ల లెక్క తేలాలి. మరోవైపు దర్శకుడు సుకుమార్‌ కూడా తన టీమ్‌కు గిఫ్ట్‌లు ఇచ్చే పనిలో ఉన్నారట. ప్రస్తుతం టీమ్‌ మొత్తం డిసెంబరు 17 కల్లా సినిమాను విడుదల చేసే పనిలో రాత్రనక పగలనక పని చేస్తోంది. పనులు పూర్తయితేనే గిఫ్ట్‌ల విషయంలో క్లారిటీ రావొచ్చు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus