టాలీవుడ్‌లో బ్యాడ్ టైం నడుస్తున్న బ్యూటీస్ వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేయాలంటే.. గ్లామర్, పర్ఫార్మెన్స్‌తో పాటు హిట్స్, లక్ కూడా అవసరం.. సూపర్ హిట్స్ అందుకుని, స్టార్ డమ్ వస్తే ‘గోల్డెన్ లెగ్’ అని.. ఫ్లాప్స్ పడితే ‘ఐరెన్ లెగ్’ అని స్టాంప్ వేసేస్తారు. పనిలో పనిగా ఆఫర్స్ కూడా తగ్గిపోతాయి. త్రిష, అనుష్క, కాజల్, తమన్నా లాంటి కొందరు కథానాయికలు మాత్రమే దశాబ్దానికి పైగా కెరీర్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చిన హీరోయిన్ల కెరీర్ హిట్స్ మీదే ఆధారపడి ఉంది.. మొన్నటి వరకు ఫామ్‌లో ఉండి.. ఉన్నట్టుండి డౌన్ ఫాల్ రావడంతో.. అర్జెంటుగా హిట్ పడాలి.. తిరిగి ట్రాక్‌లోకి రావాలి అని ఈగర్‌గా వెెయిట్ చేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు చూద్దాం..

పూజా హెగ్డే..

ఈ ఏడాది పూజా పాప హీరోయిన్‌గా నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ మూడు సినిమాలు విడుదలయ్యాయి.. ఈ మూడు నువ్వా నేనా అన్నట్టు ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్స్ అయ్యాయి. ఎలాగైనా సరే ఓ హిట్ కొట్టాలి.. లేదంటే పరిస్థితి చేజారిపోతుంది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుంది పూజా హెగ్డే..

కృతి శెట్టి..

‘ఉప్పెన’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కన్నడ కస్తూరి కృతి శెట్టి.. దాంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.. అవకాశాలొచ్చినంత ఈజీగా హిట్స్ అయితే రావు కదా.. ఈ సంవత్సరం ‘బంగార్రాజు’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘వారియర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక్క ‘బంగార్రాజు’ మినహా ఇస్తే మిగతా మూడు ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టేసింది. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘కస్టడీ’ చేస్తుంది. తిరిగి ట్రాక్ ఎక్కాలంటే కృతికి ఉన్నపళంగా ఓ హిట్ పడాల్సిందే..

కీర్తి సురేష్..

‘మహానటి’తో నేషనల్ అవార్డ్ అందుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వరుసగా సినిమాలైతే చేసింది కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయింది. హైలెట్ ఏంటంటే.. ఏకంగా ఆరు ఫ్లాపులతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది కీర్తి.. ‘సర్కారు వారి పాట’ హిట్ అయినా కానీ క్రెడిట్ అంతా మహేష్ అకౌంట్‌లోకే వెళ్లిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ లో ఆయనకు చెల్లెలిగా.. నేచేరల్ స్టార్ నాని ‘దసరా’లో జోడీగా నటిస్తోంది. ఈ రెండు సినిమాల రిజల్ట్ కీర్తి కెరీర్‌కి డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా మారాయి..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus