Hari Hara Veera Mallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ మరింత డిలే.. ఏమైందంటే?
- November 7, 2024 / 03:30 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ మొదటి నుండి అనుకున్నట్టు జరగడం లేదు. ముందుగా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా అనుకోలేదు. కానీ తర్వాత బడ్జెట్ పెరిగిపోతుండటంతో రెండు పార్టులుగా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా ‘హరిహర వీరమల్లు’ ని ప్రకటించారు. కానీ తర్వాత ప్రకటించిన ‘భీమ్లా నాయక్’ కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా అయిపోయింది కానీ.. ఇప్పటికీ ‘హరిహర వీరమల్లు’ లెక్కలు మారడం లేదు.
Hari Hara Veera Mallu

కొన్ని నెలల క్రితం దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు ప్రకటించారు. తర్వాత రత్నం కృష్ణ (అప్పట్లో జ్యోతి కృష్ణ) (Jyothi Krishna ) దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అతని తండ్రి ఏ.ఎం.రత్నం (AM Rathnam) ఈ చిత్రానికి నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ డేట్ ని లక్ష్యంగా పెట్టుకుని మళ్ళీ షూటింగ్ ప్రారంభించినట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ.. డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ మొదలుపెట్టడానికి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ప్రాంతంలో ఓ పెద్ద సెట్ వేశారు. కొన్ని రోజులు షూటింగ్ కి వచ్చారు పవన్ కళ్యాణ్. తర్వాత మళ్ళీ ఆయన పొలిటికల్ గా బిజీ అయిపోయారట. దీంతో షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది. అక్కడ చేయాల్సిన షెడ్యూల్ కూడా పూర్తి కాలేదు. సెట్ వేసినందుకు నిర్మాతకి కోట్లు ఖర్చయ్యాయి.

చూస్తుంటే సంక్రాంతి తర్వాతే మళ్ళీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అనుకున్న టైంకి అంటే 2025 మార్చి 28 కి ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. మరోపక్క అదే డేట్ కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 12 వ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘హరిహర వీరమల్లు’ తర్వాత అదే డేట్ కి ప్రకటించడంతో.. విజయ్ సినిమా వెనక్కి వెళ్తుంది అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి ఢోకా లేనట్లే..!

















