టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు (Prasanth Varma) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. హనుమాన్ (Hanuman) సినిమాతో ప్రశాంత్ వర్మ తన రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచుకున్నారు. ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ నటించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు పడనున్నాయి. కార్తీ (Karthi సత్యం సుందరం (Sathyam Sundaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చుడాల్సి ఉంది.
Prasanth Varma
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తే కార్తీకి తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కార్తీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. సత్యం సుందరం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా దేవర హవా ఉండటంతో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సత్యం సుందరం తమిళ్ వెర్షన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. దేవరకు (Devara) బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదు. రాజమౌళి (S. S. Rajamouli) నెగిటివ్ సెంటిమెంట్ ఎన్టీఆర్ సినిమాతోనే మొదలైందని ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాతోనే ముగుస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఈ సినిమాలో దాదాపుగా 30 నిమిషాల పాటు అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఉంటాయని తెలుస్తోంది. దేవరకు పోటీగా రిలీజ్ కావడంతో సత్యం సుందరం సినిమాకు సరైన థియేటర్లు దక్కడం లేదు. దేవర సినిమా 2024 టాప్ హిట్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ క్రేజ్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగింది.