మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో చరణ్, తారక్ స్నేహితులు కావడంతో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన రోజు నుంచి చరణ్ తారక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా గొడవ జరుగుతోంది.
చరిత్రలో కలవని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే కల్పిత కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం. అయితే తాజాగా ఒక రూమర్ ను పట్టుకుని చరణ్ తారక్ ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ అధికారక ప్రకటనకు ముందు రాజమౌళి డైరెక్షన్ లో సూర్య తారక్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిరంజీవి దానయ్య ద్వారా సూర్య స్థానంలోకి చరణ్ ను తీసుకొచ్చారని
కామెంట్లు పెట్టడంతో పాటు జంజీర్ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిందని చెబుతున్నారు. చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని రాజమౌళి సూర్య, ఎన్టీఆర్ కాంబోలో ప్లాన్ చేశారని సూర్య ఫ్లాపుల్లో ఉండటంతో చరణ్ కు రాజమౌళి అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవతో ఈ సినిమాలో స్టార్ హీరో సూర్యకు ఛాన్స్ మిస్సైందా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.