Janhvi Kapoor: మొన్న నాన్న… నిన్న కూతురు… ఫుల్‌ క్లారిటీ ఇచ్చేస్తున్నారుగా!

బాలీవుడ్‌లోనే కాదు, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న అందం జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) . అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తనయగా పరిశ్రమలో అడుగుపెట్టినా సినిమాల ఎంపికలో కానీ, అందాల ఆరబోతలో కానీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ. హాట్‌ ఫొటో షూట్‌లతో ఎప్పుడూ వైరల్‌గా నిలిచే జాన్వీ… ప్రేమ విషయంలోనూ అంతే వైరల్‌ అవుతుంటుంది. ఆమెకు ఓ లవర్‌ ఉన్నాడని ఇన్నాళ్లూ తెలిసినా ఆమె ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

ఇటీవల తండ్రి బోనీ కపూర్‌ (Boney Kapoor) కాస్త క్లారిటీ ఇస్తే ఇప్పుడు ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే జాన్వీ కపూర్‌ ఇటీవల ధరించిన గొలుసు ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా మారింది కాబట్టి. అదేంటి గొలుసుకు, ప్రియుడికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఆ గొలుసు మీద ప్రియుడి ముద్దు పేరు ఉంద కాబట్టి. బోనీ కపూర్‌ నిర్మించిన ‘మైదాన్‌’ (Maidaan) సినిమా ప్రీమియర్‌ షోకు జాన్వీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తెలుపు రంగు దుస్తుల్లో జాన్వీ మెరిసింది, అయితే అందులో ఆమె నెక్లెస్‌ బాగా హైలైట్‌ అయింది. దాని మీద ‘శిఖు’ అనే లోగో ఉండటమే కారణం. శిఖర్‌ పహారియా ముద్దు పేరు శిఖు అని ఆ మధ్య ఓ టాక్‌ షోలో జాన్వీ చెప్పిన సంగతి తెలిసిందే. స్పీడ్‌ డయల్‌లో ఆ పేరు కూడా ఉంటుంది అని చెప్పింది. మొన్నేమో జాన్వీతో ఏదైనా చిన్నపాటి గొడవ జరిగి మాట్లాడకపోతే శిఖర్‌ పహారియాతో మాట్లాడి ఆమె గురించి తెలుసుకుంటాను అని బోనీ కపూర్‌ చెప్పాడు.

ఇప్పుడు ఆమెమో నెక్లెస్‌ మీద ఏకంగా శిఖు అని రాసుకొచ్చింది. దీంతో ఇక పెళ్లి బాజాలు మోగడమే తరువాయి అని కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. ఇక జాన్వీ తెలుగు సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం తారక్‌తో (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాలు చేస్తోంది. అలాగే రామ్‌ చరణ్‌ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu) సినిమాలో కూడా ఆమె కథానాయిక. ఇవి కాకుండా ఓ తమిళ సినిమా కూడా ఓకే చేసింది అని టాక్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus