టాలీవుడ్‌కి సీక్వెల్స్ అసలు కలసి రావు. ఎన్నో ఏళ్లుగా సీక్వెల్స్ వస్తున్నాయి.. వెళ్తున్నాయి. అయితే ఎప్పుడు అయితే చాప్టర్స్ కాన్సెప్ట్ మొదలుపెట్టారో టాలీవుడ్‌కి మంచి కాన్సెప్ట్ దొరికినట్లయింది. ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి, చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ రెండు ముక్కలు చేసి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు ఇలా వచ్చి మంచి విజయం అందుకున్నాయి. మరో సినిమా రెడీ అవుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? మరో సినిమా ఇలా రెడీ అవుతోంది అంటున్నారు.
‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీయఫ్’, ‘సలార్’, ‘బింబిసార’… ప్రస్తుతానికి ఈ సినిమాలకు రెండు పార్టులు ఫిక్స్ అయ్యాయి. ఒక్క ‘బింబిసార’ తప్ప మిగిలినవన్నీ పూర్తయ్యాయి, ‘బింబిసార’ ఇప్పటికే ప్రారంభమవ్వాలి కానీ.. ఎందుకో ఇంకా ప్రారంభమవ్వాలి. ఇప్పుడు మరో సినిమా రెండు ముక్కల కాన్సెప్ట్‌లో వస్తోంది. పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమాకు కూడా రెండు ముక్కలు చేస్తున్నారు అని అంటున్నారు.
‘ఓజీ’ (OG Movie) సినిమాను పార్ట్ 1, పార్ట్ 2గా తీసుకొస్తారని అంటున్నారు. ఇప్పటికే పూర్తయిన 60 శాతంతో ఓ పార్ట్ రిలీజ్ చేసేయొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ మరో పది, పదిహేను రోజులు కాల్‌షీట్లు వస్తే సరి అంటున్నారు. వాటితో ప్యాచ్ వర్క్‌లతో సహా పూర్తి చేసి… ఏడాది ఆఖరులో రిలీజ్ చేసేయొచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సినిమా రషెష్ చూస్తే ఫస్ట్ హాఫ్‌లో 45 నిమిషాలే ఉంటుందట. సెకండాఫ్‌లో పూర్తిగా ఉంటాడట.
కమల్ హాసన్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘విక్రమ్’ సినిమా, చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ తరహాలోనే అన్నమాట. ఆ సినిమాల్లో కూడా హీరో ఫస్ట్ హాఫ్‌లో తక్కువ సమయమే కనిపిస్తాడు. ఇప్పుడు ‘ఓజీ’ సినిమా విషయంలోనూ అలానే జరుగుతుంది అంటున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. మామలూగా అయితే డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ట్విటర్ హ్యాండిల్ ఇలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంది. మరి ఈ పుకారు విషయంలో ఏం చేస్తారో చూడాలి.