పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘జనసేన’ పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు కీలక శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంతో కలిసి ఆయన ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తమిళంలో ‘తంతి’ అనే పాపులర్ ఛానల్ కి పవన్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “2019 ఎన్నికల తర్వాత పార్టీని నిలబెట్టడానికి డబ్బులు అవసరం పడింది.
నేను వేరే వ్యాపారాల్లో భాగస్వామిని కాదు. నా దగ్గర కోట్లు లేవు. కాబట్టి.. నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు తెలిసింది సినిమా. అందుకే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. అవి కూడా బాధ్యతగానే చేయాలి అనుకున్నాను. సినిమాలు చేసినా.. నా పొలిటికల్ కెరీర్ ను ఏ రోజు పక్కన పెట్టింది లేదు. నేను పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పుడు సినిమాలు కూడా హోల్డ్ లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు.
సో పవన్ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చింది కేవలం డబ్బుల కోసమే..! ఇది గతంలో కూడా చెప్పాడు. కాకపోతే.. ఈ కామెంట్స్ ‘నిర్మాతలకి సాధారణంగా అనిపిస్తాయి’ అని చెప్పలేం. ఎందుకంటే.. పవన్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మేలో రిలీజ్ అవుతుంది. దాదాపు 5 ఏళ్ళ నుండి నిర్మాణ దశలో ఉన్న సినిమా ఇది. ‘ఓజి’ (OG Movie) కూడా కంప్లీట్ అవ్వాలి. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అయితే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి.