‘టాలీవుడ్లో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఫిలిం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)(Game Changer) చేశారు. అలాగే ప్రశాంత్ నీల్ వంటి పెద్ద పెద్ద దర్శకులతో పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మీకు సినిమా డైనమిక్స్ అన్నీ తెలుసు ఇక్కడ. మీ పక్కన కూర్చున్న మోహన్ లాల్(Mohanlal) , పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) .. కేరళలో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా తీసి… ఇప్పటికీ పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సో వాళ్ళని చూసి మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా?’
అంటూ దిల్ రాజుని ఈరోజు హైదరాబాద్లో జరిగిన ‘ఎంపురాన్’ (L2: Empuraan) ప్రెస్ మీట్లో ప్రశ్నించాడు ఓ రిపోర్టర్. ఇందుకు దిల్ రాజు (Dil Raju) .. ‘రాజమౌళి(S. S. Rajamouli) , ప్రశాంత్ నీల్'(Prashanth Neel) వంటి వారు అదే చేస్తున్నారు అని సమాధానం ఇచ్చాడు. ‘అయినా ఆ రిపోర్టర్ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఇదే జరిగిందా?’ అంటూ మళ్ళీ ప్రశ్నించాడు. అందుకు దిల్ రాజు.. ‘అవును.. ‘గేమ్ ఛేంజర్’ స్టార్ట్ అయినప్పుడు అదే స్కూల్లో ఉంది?’
అంటూ కొంచెం అసహనంతోనే సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే ఇంకో లేడీ రిపోర్టర్ ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావన తీసుకురాబోతుంటే.. వెంటనే దిల్ రాజు కలగజేసుకుని.. ‘పక్క రాష్ట్రం నుండి ఇద్దరు స్టార్స్ తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళ ముందు వేరే సినిమా ప్రస్తావన ఎందుకు. ‘లూసిఫర్ 2′ గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ సినిమా గురించి అడగండి’ అంటూ కొంచెం ఘాటుగానే స్పందించారు దిల్ రాజు.
ఆ వెంటనే పృథ్వీరాజ్ కూడా ‘ప్లీజ్ మా సినిమా గురించే అడగండి’ అంటూ విన్నవించుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ ఫలితం అందరికీ తెలుసు. అయినా ‘పుండు మీద కారం జల్లినట్టు’.. ఇంకా దిల్ రాజుని ఆ విషయం గురించి అడిగి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.