‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్రను, అలాగే మంచి విజయాన్ని కూడా అందుకుంది షాలిని పాండే (Shalini Pandey). ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఏమైందో ఏమో ఆ తర్వాత సౌత్ సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తోంది. ఇటు సినిమాలు, అటు ఓటీటీ కవర్ చేస్తోంది. అయితే రీసెంట్‌గా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తన కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడి వల్ల ఇబ్బందిపడినట్లు షాలిని పాండే చెప్పుకొచ్చింది.
ఆ ఇబ్బంది కారణంగా అతడిపై కేకలు వేశానని చెప్పింది. అయితే ఆ సమయంలో తనకు చుట్టుపక్కల వాళ్లు సపోర్టు చేయలేదని, కానీ తాను చేసింది మంచి పనే అని నమ్మానని చెప్పింది. సినిమాల్లో రాణించాలనే ఆశతో కుటుంబాన్ని వదిలేసి వచ్చాను. ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘అర్జున్ రెడ్డి’లో అవకాశం ఇచ్చారని చెప్పింది. తన సినిమా ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు.
తన కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఓ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడి ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డానని తెలిపింది. క్యారవాన్‌లో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు తన అనుమతి లేకుండా ఓ దర్శకుడు డోర్ తీశాడని, దాంతో తనకెంతో కోపం వచ్చిందని, ఆయనపై కేకలు వేశానని చెప్పింది. తన చర్యతో ఆ దర్శకుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడని షాలిని పాండే తెలిపింది. అయితే ఆ సమయంలో చుట్టూ ఉన్న వాళ్లు తన రియాక్షన్‌ను తప్పు పట్టారని తెలిపింది.
కానీ తనకు మాత్రం తప్పుగా అనిపించలేదని ఆమె తెలిపింది. అయితే ఆ దర్శకుడు ఎవరు అనే విషయం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఆమె సౌత్‌లో చేసిన సినిమాలు ఏంటా అని చూస్తే.. తెలుగులో ‘118’ (118 Movie) , ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘నిశబ్దం’ (Nishabdham) సినిమాలు చేసింది. ‘మహానటి’ (Mahanati), ‘ఎన్టీఆర్: కథానాయకుడు’లో (NTR: Kathanayakudu) అతిథి పాత్రలో కనిపించింది. ఇక తమిళంలో ‘100 % కాదల్’, ‘గొరిల్లా’ సినిమాలు చేసింది. ఇక ‘ఇడ్లీ కడై’లో (Idly Kadai) ఓ పాత్రలో కనిపించబోతోంది. మరి ఇందులో ఎవరో?