నితిన్ (Nithiin), దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) కలయికలో ‘భీష్మ’ (Bheeshma) అనే సినిమా వచ్చింది. అది మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు రెండో సినిమాగా ‘రాబిన్ హుడ్’ (Robinhood) వస్తుంది. మార్చి 28 న ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ డోస్ పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ట్రైలర్ ను కూడా వదిలింది. ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ 2 :37 నిమిషాల నిడివి కలిగి ఉంది.
హీరో అర్ధరాత్రి పూట దొంగతనాలు చేస్తున్నట్లు చూపించారు. తర్వాత ఓ పెద్ద బిజినెస్ మెన్ కూతురు నీరా వాసుదేవ్ గా శ్రీలీల (Sreeleela) ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు Z + క్యాటగిరి సెక్యూరిటీ ఇచ్చే టీంతో పాటు హీరో కూడా ఆమె వద్దకు వెళ్లి ఆమెకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో వచ్చే రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిషోర్ (Vennela Kishore)..ల కామెడీ అలరించే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ‘వాడు మీ సెన్స్ చుట్టూ ఫెన్స్ కట్టేస్తున్నాడు’ ‘4 ఫాదర్స్ అంటే నలుగురు ఫాదర్లు, నలిగిపోయిన తల్లి కాదు’ ‘కరోనా వస్తే క్వారెంటైన్ 14 డేసే..
కానీ నేనొస్తే లైఫ్ లాంగ్’ వంటి డైలాగులు దర్శకుడు వెంకీ కుడుముల స్టైల్లో ఉన్నాయి. ట్రైలర్లో విలన్ ట్రాక్ ను బట్టి మెయిన్ కథ ఏంటి అన్నది హింట్ ఇచ్చారు. చివర్లో ఈ సినిమాలో చిన్న రోల్ చేస్తున్న క్రికెటర్ వార్నర్ ని చూపించి.. హైప్ పెంచే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా ట్రైలర్లో డైలాగ్స్ మాదిరి.. ఇది ‘ఇల్ – లాజికల్ అనిపించినా కిక్ ఇచ్చేలానే కనిపిస్తోంది’. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :