నాగశౌర్య (Naga Shaurya) నటించిన సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆడట్లేదు. అసలు వచ్చి వెళ్తున్నట్లు కూడా చాలా మందికి తెలీడం లేదు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. 2018లో వచ్చిన ‘ఛలో’ (Chalo) తర్వాత ఒక్క హిట్ సినిమా కూడా అతని ఖాతాలో పడలేదు. ఒకటి,రెండు .. యావరేజ్ సినిమాలు మాత్రమే పడ్డాయి. అవే ‘వరుడు కావలెను’ (Varudu Kaavalenu), ‘కృష్ణ వ్రింద విహారి’..! (Krishna Vrinda Vihari) అయితే ఎంతో కష్టపడి చేసిన ‘అశ్వద్ధామ'(Aswathama) , ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, (Phalana Abbayi Phalana Ammayi) ‘రంగబలి’ (Rangabali).. వంటి సినిమాలు నిరాశపరిచాయి.
అయితే గత ఏడాది వచ్చిన ‘రంగబలి’ సినిమాపై నాగ శౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇంకో విధంగా ఈ ప్రాజెక్టు పై చాలా కాన్ఫిడెంట్ గా కూడా అతను కనిపించాడు. ఏకంగా జర్నలిస్ట్..ల పైనే సెటైర్లు వేస్తూ ఓ వీడియో చేశాడు అంటే అతని కాన్ఫిడెన్స్ అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఎటువంటి ఇంపాక్ట్ చూపలేదు.
కానీ ఆ సినిమా డైరెక్టర్ పవన్ బసంశెట్టితో (Pawan Basamsetti) మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు నాగ శౌర్య. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లోనే ఈ సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాని నిర్మించేందుకు ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ సిద్ధంగా లేదట. దీంతో మరో కొత్త బ్యానర్ ఈ ప్రాజెక్టుని నిర్మించే ఛాన్స్ దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్.