అదేదో సినిమాలో చెప్పినట్లు తెలుగులో చెప్పిన విషయాన్ని తెలుగులో రాసేటప్పుడు ట్రాన్స్‌లేషన్ సరిగా చేయలేదు అన్నట్లు… దిల్ రాజు గురించి చిరంజీవి చెప్పిన మాటను తమకు నచ్చినట్లుగా రాసుకొన్నాయి కొన్ని మీడియా సంస్థలు. దీంతో ‘హను – మాన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా దిల్ రాజును విమర్శించిన చిరు అంటూ ఎనిమిదో తేదీ ఉదయం నుంచి వార్తలొచ్చేశాయి. వాటి మీద దిల్ రాజు స్పందించేసరికి ఇప్పుడు కొత్త పుకార్లు వండుతున్నారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అదే ‘దిల్ రాజుకు కోపం రావడానికి రాతలు కారణం కాదని, వ్యాపారం కారణం’ అని ఏవేవో రాసుకొస్తున్నారు. తనను వ్యక్తిగతం బ్యాడ్ చేస్తున్న కొంతమంది మీడియా జనాలపై దిల్ రాజు తన ఆగ్రహం వ్యక్తం చేస్తే దానికి మరో కోణం చూపిస్తున్నారు అంటూ మరోసారి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన హ్యాపీగానే ఉన్నారని, వ్యాపారం అన్నాక పోటీ ఉంటుంది అంటూ చెబుతున్నారు.
అంతేకానీ నైజాం ఏరియాలో ఓ కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వల్ల సినిమా బిజినెస్ విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు చిత్రించడం సరికాదు అంటున్నారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు వచ్చినప్పుడల్లా తనను తప్పుగా చిత్రీకరిస్తున్నారనే కారణంతోనే దిల్ రాజు అలా అన్నారని గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని ఇటీవల ఆయా మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారని, తన ఆవేదనను కాస్త కఠువుగా చూపించరు అని అంటున్నారు. ఈ సమయంలో లేని పోని విమర్శలకు పోవడం సరికాదు అంటున్నారు.
అసలు ఆ రోజు దిల్ రాజు (Dil Raju) ఏమన్నారో మళ్లీ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ‘హను – మాన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి మాటలను కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్ల తాటతీస్తా. వ్యాపారపరంగా తనపై వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ రోజు నుండి ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామని మీ ఉద్దేశం. మీ వెబ్‌సైట్ల వ్యూస్ కోసం నా పేరు వాడితే ఊరుకునేది లేదు అని కాస్త కోపంగా మాట్లాడారు దిల్ రాజు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!