Atlee: అంత పెద్ద హిట్‌ ఇచ్చాక కూడా డైరక్టర్‌ హీరోకి ఈ కష్టాలేంటి?

షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ అనే సినిమాను తెరకెక్కించి పాన్‌ ఇండియా దర్శకుడు అయిపోయారు. అప్పటివరకు తమిళ, తెలుగు భాషల్లో సినిమాలతో విజయాలు అందుకున్న అట్లీ.. ఆ సినిమా విజయంతో ఇంకా తిరిగి సౌత్‌కి రాలేదు. అక్కడే బాలీవుడ్‌లో ఉండిపోయి.. ‘బేబీ జాన్‌’ సినిమాను కలిస్‌తో తీయించారు. త్వరలో తన కొత్త సినిమాను స్టార్ట్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Atlee

షారుఖ్‌ ఖాన్‌తోనే అట్లీ కొత్త సినిమా ఉంటుందని.. ‘జవాన్‌ 2’ సినిమా చేస్తారని తొలుత అన్నారు. షారుఖ్‌ ఖాన్‌ కూడా ఇంచుమించు ఇలానే మాట్లాడారు. అయితే ఆయన కాదు సల్మాన్‌ ఖాన్‌తో సినిమా అని చెప్పారు. అట్లీ కూడా సల్మాన్‌తో సినిమా ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే షాహిద్‌ కపూర్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

గత కొంత కాలంగా షాహిద్‌ కపూర్‌ – షాహిద్‌ కపూర్‌ మధ్య సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని, షాహిద్‌ ఉత్సాహంగా ఉన్నాడని చెబుతున్నారు. సినిమా కోసం స్క్రిప్ట్‌ను అట్లీ ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది సెకండాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే సల్మాన్‌ ఖాన్‌ సినిమా ఏమైంది అనేదే ఇక్కడ ప్రశ్న.

షాహిద్‌ కపూర్‌ సినిమా అయ్యాక సల్మాన్‌ ఖాన్‌తో అట్లీ సినిమా ఉంటుంది అనే టాక్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మరో రెండేళ్ల వరకు అట్లీ సౌత్‌కి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇది జరిగితే ఇక్కడ అట్లీ కోసం వెయిట్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ లాంటి వాళ్లు ఇంకొన్నాళ్లు ఆగాల్సి వస్తుంది. చూద్దాం అట్లీ క్లారిటీ ఇస్తే ఇంకా చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.

 ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ నటుల్ని చూశారా? ఎందుకు తీసుకున్నారో? ఏం చేయించారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags