‘ప్రాజెక్ట్ K’.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. కారణం ఈ సినిమా గురించి రోజుకో కొత్త విషయం బయటకు రావడం, అది భారతీయ సినిమా గతిని మార్చేలా ఉండటం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. దర్శకుడు ఇప్పటికే వైవిధ్యమైన దర్శకుడిగా పేరు గాంచినా.. అతని గొప్పతనం ఇంకా పాన్ ఇండియాకు వెళ్లేదు. కానీ పాన్ ఇండియా స్థాయి స్టఫ్ ఉందనేది పక్కా.
ప్రభాస్, దీపిక పడుకొణె, అమితాబ్ బచ్చన్.. ఇలా భారీ తారగణంతో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమా గురించి రీసెంట్‌గా చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమాలో టైమ్ ట్రావెల్ అని, సూపర్ హీరోస్ నేపథ్యమని ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మన ఖండం మీద జరగదని, అసలు మన గ్రహమే కాదని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం తెలిసిందే. అయితే అది సినిమా పేరు గురించి. ‘ప్రాజెక్ట్ K’లో K అంటే కల్కి అంటున్నారు.
2012లో యుగాంతానికి సంబంధించి కొన్ని వార్తలు, సినిమా కూడా వర్చాయి. అయితే ఆ తరవాత ఎవరూ యుగాంతం కథను ముట్టుకోలేదు. అయితే ‘ప్రాజెక్ట్ K’ కథ యుగాంతానికి సంబంధించింది అనేది లేటెస్ట్ టాక్? కలియుగం కల్కి అవతారంతోనే అంతం అవుతుంది అని అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమాలో కల్కి అంతం చూపించి.. కలి యుగం ముగించేలా చూపిస్తారు అని అంటున్నారు. అయితే ఎక్కడా పురాణాల టచ్ ఉండదు అంటున్నారు.
అయితే సినిమాలో అండర్ కరెంట్‌లో పురాణాల పాత్రలు కనిపిస్తాయి అని సమాచారం. పాత్రలు, వాటి పేర్లు, చూపించే సందర్భాలు.. ఇలా అన్నీ పురాణాలతో అనుసంధానంగా ఉంటాయి అంటున్నారు. అయితే వీటిపై టీమ్ నుంచి ఎక్కడా అధికారిక స్పందన లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా వస్తుంది అంటున్నారు కాబట్టి.. ఈ ఏడాది ఆఖరులో కాస్త క్లారిటీ రావొచ్చని టాక్.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?