చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జ.. హీరోగా మారి రెండు సినిమాలు చేసాడు. అందులో ఒకటి’జాంబీ రెడ్డి’ కాగా రెండోది ‘ఇష్క్’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ కాగా.. ‘తిమ్మరుసు’ తో పాటు ఈ చిత్రం కూడా విడుదలైంది. ఎస్.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఎన్వీ.ప్రసాద్, పరాస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ లు కలిసి నిర్మించారు. జూలై 30న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మొదటి వారానికే ఈ చిత్రం రన్ ముగిసిపోవడం గమనార్హం.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి:
నైజాం
0.12 cr
సీడెడ్
0.09 cr
ఉత్తరాంధ్ర
0.11 cr
ఈస్ట్
0.08 cr
వెస్ట్
0.06 cr
గుంటూరు
0.12 cr
కృష్ణా
0.09 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.06 Cr
తెలుగు వెర్షన్ (టోటల్)
0.76 cr
‘ఇష్క్’ చిత్రానికి రూ.2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.76 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. చాలా వరకు ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ వాళ్ళకి రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.