వరుస ప్లాపులతో సతమతమైన అల్లరి నరేష్… ‘నాంది’ తో హిట్టు కొట్టి మళ్ళీ ఊపిరిపీల్చుకున్నాడు. తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. నవంబర్ అనేది అన్ సీజన్, పైగా ఈ సినిమాకి ప్రమోషన్లు వంటివి కూడా పెద్దగా చేయలేదు. టీజర్, ట్రైలర్ పాస్ మార్కులు వేయించుకున్నాయి కానీ బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి.
దానికి తోడు మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది.కలెక్షన్ల పరంగా మొదటిరోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ రెండో రోజు నుండి డౌన్ అయ్యింది. ఒకసారి 5 డేస్ గమనిస్తే :
నైజాం | 0.68 cr |
సీడెడ్ | 0.17 cr |
ఉత్తరాంధ్ర | 0.19 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.10 cr |
కృష్ణా | 0.12 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.24 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.68 cr (షేర్) |
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రానికి రూ.4.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ కేవలం రూ.1.68 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.67 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘లవ్ టుడే’ ‘తోడేలు’ వంటి చిత్రాలు రిలీజ్ అవ్వడం..
అలాగే ‘మాసూద’ ‘గాలోడు’ సినిమాలు ఇంకా స్ట్రాంగ్ రన్ అవుతూ ఉండటం.. దానికి తోడు అన్ సీజన్ కావడం కూడా కావడం.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం కలెక్షన్ల పై దెబ్బ కొట్టినట్టు స్పష్టమవుతుంది
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..