ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు 2 రిలీజ్ అవుతున్నాయి. అవే ‘జాక్’ (Jack) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly). ప్రదీప్ (Pradeep Machiraju) ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi ) కూడా రిలీజ్ అవుతుంది. కానీ దాన్ని ఆడియన్స్ ఎవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ‘జాక్’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పై కూడా బజ్ ఏమీ లేదు. ఇలాంటి టైంలో మేకర్స్… ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. కానీ వీటికి ఆ చప్పుడు కూడా ఏమీ వినిపించడం లేదు.
సరే.. అన్నీ ఎలా ఉన్నా టికెట్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయా? అంటే అదీ లేదు. మల్టీప్లెక్సుల్లో ‘జాక్’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టికెట్ రేట్లు గమనిస్తే.. రూ.295 , రూ.350 గా ఉన్నాయి.సింగిల్ స్క్రీన్స్ లో రూ.110 , రూ.175 గా ఉన్నాయి. వీటికి మాత్రమే కాదు ‘జాట్’ (Jaat) అనే సినిమా కూడా వస్తుంది. దానికి కూడా రూ.295 , రూ.350 … రూ.175, రూ.110 అలానే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాకి, మిడ్ రేంజ్ సినిమాకి..
ఇంతింత టికెట్ రేట్లు పెట్టడానికి ప్రేక్షకులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? సినిమాలకి ఎక్కువగా వచ్చేదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే సినిమాలకి వెళ్ళరు. పబ్బులు వంటి వాటికి పోతారు. ఇది నిర్మాతలకి తెలియనిది కాదు. అయినా వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకీ సినిమాని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. సినిమా చూడాలనే ఆసక్తి ఉన్నా..
టికెట్ రేట్లతో ఆడియన్స్ ని థియేటర్లకు రాకుండా చేస్తుంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టికెట్ రేట్లు రూ.100 , రూ.150 గా ఉన్న రోజుల్లో జనాలు ఎలా థియేటర్లకు వచ్చి చూసేవారో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. పెద్ద సినిమాలకి ఎలాగూ తప్పదు. కానీ మిడ్ రేంజ్ సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకి కూడా అంతంత టికెట్ రేట్లు పెట్టుకుని ఎందుకు జనాలు వెళ్తారు అనేది గట్టిగా వారు చర్చించుకోవాలి.