హీరోగా ఉన్నప్పటి కంటే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత జగపతి బాబు డిమాండ్ బాగా పెరిగిందనే చెప్పాలి. ‘లెజెండ్’ చిత్రం ఈయన సెకండ్ ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ,హిందీ,మలయాళం, కన్నడ భాషల్లో కూడా బిజీ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు.ప్రస్తుతం ఈయన కాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు తెగ వేచి చుస్తున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పటికీ జగపతి బాబు ఒక్కో సినిమాకి.. ఒక రోజు షూటింగ్ కు గాను రూ.25 లక్షల వరకు తీసుకుంటున్నట్టు వినికిడి.
అంటే 10 రోజుల షూటింగ్ కనుక ఉంటే.. మొత్తం రూ.2.5 కోట్ల వరకు ఉంటుందన్న మాట. ప్రస్తుతం జగపతి బాబు ‘రాధే శ్యామ్’ ‘సలార్’ వంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటి పెద్ద సినిమాల కోసం ఆయన ఎక్కువ రోజులు కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా జగపతి బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటి అంటే.. ఇక నుండీ ఆయన నటించే సినిమాలకి లాభాల్లో వాటాలు తీసుకుంటారట. అది కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలోనే ఆయన కొంత శాతం వాటా తీసుకుంటారని వినికిడి.
అడ్వాన్స్ కాకుండా మిగిలిన పారితోషికం బదులు జగపతి బాబు ఈ ఫార్ములా ఫాలో అవుతారని తెలుస్తుంది. ఇందుకు దర్శకనిర్మాతలు కూడా సంతోషంగా ఓకే చెప్పారని తెలుస్తుంది.బిజినెస్ జరిగే వరకు ఎదురుచూస్తే నిర్మాతలకి వడ్డీ రూపంలో కొంత అమౌంట్ మిగులుతుంది. కానీ జగపతి బాబు ఎంత వాటా తీసుకుంటారు? దానికి ఆయన పెట్టిన షరతులు ఏమిటి అనే విషయాల పై ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తుంది.