Jagapathi Babu, Jr NTR: తారక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు!
- January 16, 2022 / 12:45 PM ISTByFilmy Focus
ఒకప్పుడు క్లాస్ రోల్స్ లో నటించి ఫ్యామిలీ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు లెజెండ్ సినిమా నుంచి వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో, విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ జగపతి బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాలు నటుడిగా జగపతి బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో క్లాస్ విలన్ గా నటించి మెప్పించిన జగపతి బాబు అరవింద సమేత వీరరాఘవ సినిమాలో మాస్ విలన్ గా మెప్పించారు.
విలన్ రోల్స్ లో నటించడానికి ఈ నటుడు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ అరవింద సమేత వీరరాఘవ సినిమాకు స్క్రిప్ట్ బాగా కుదిరిందని ఆ సినిమాలో నా పాత్ర ఎగ్రెసివ్ పాత్ర అని జగపతిబాబు చెప్పారు. అయితే తారక్ మాత్రం సినిమాలో కూల్ పాత్రలో కనిపించారని జగపతిబాబు పేర్కొన్నారు. బసిరెడ్డి పాత్రకు ఒప్పుకున్న తర్వాత తనకు తారక్ శిక్ష విధించాడని జగపతి బాబు అన్నారు.

అరవింద సమేత సమయంలో ఎన్టీఆర్ బసిరెడ్డి పాత్ర చాలా బాగుందని చెబుతూ రకరకాలుగా తిట్టేవాడని జగపతి బాబు కామెంట్లు చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రేమగానే తిట్టేవాడని కోపంతో కాదని ఆయన అన్నారు. అరవింద సమేత మూవీ రిలీజైన తర్వాత కూడా సినిమాలో మొదట బసిరెడ్డి గుర్తుంటాడని ఆ తర్వాత నేను గుర్తుంటానని తారక్ చెప్పారని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తనను దూరం పెడతానని చెప్పారని జగపతి బాబు కామెంట్లు చేశారు.

నాతోనే మీరు ఆడుకుంటున్నారని నాలుగైదు సంవత్సరాలు మీ ముఖం చూపించకండి అంటూ తారక్ సరదాగా అన్నారని జగపతి బాబు కామెంట్లు చేశారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాపై దృష్టి పెట్టారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ గురించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తను హీరోగా నటించే సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు,
2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!
















