టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మరో సారి తన ఆవేదనను వెళ్లగక్కారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని నటులకు విలువ ఇవ్వమని కోరారు. గతంలోను కోట శ్రీనివాస్ రావు తెలుగు నటులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారు. అలాగే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో తాము ఎలా నటిస్తే తెలుగు దర్శకుల కంటికి కనిపిస్తామని అడిగారు.
“మొన్న ఈ మధ్య సినిమా రిలీజ్ అయింది. ఇంతవరకు నేను హీరో గురించి ఎవరైనా చెప్పగా వినలా. దాంట్లో మోహన్ లాల్ బాగా చేసాడండీ. ఇంకా తెలుగు సినిమా ఏముంది?, మోహన్ లాల్ చేయకుండా ఎట్టుంటాడు. అతను మలయాళంలో గ్రేట్ యాక్టర్. అతన్ని నువ్వు పెట్టుకుని బాగా చేసాడంటే.. తెలుగు వాడు ఏమి అయి పోయాడు.” అని ఘాటుగానే విమర్శించారు. అయన జనతా గ్యారేజ్ సినిమా పేరు చెప్పక పోయినా ఆ సినిమా గురించేనని అందరికీ అర్ధమయింది. చివరగా మన నటులకు భోజనం పెట్టరా ? అని కోట శ్రీనివాస్ రావు అడిగిన ప్రశ్నకు.. ఇతర భాషల్లోని నటులను కోట్లు ఇచ్చి తెచ్చుకుంటున్న మన దర్శకులు ఏమని సమాధానం చెబుతారో.. !!!.