హాలీవుడ్ సినిమా ‘ఇంటర్ స్టెల్లార్’ కి ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యింది. ఇటీవల ఈ సినిమా విడుదలై 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రిలీజ్ ఉండటం వల్ల మల్టీప్లెక్సుల్లో ‘ఇంటర్ స్టెల్లార్’ కి స్క్రీన్స్ దొరకడం లేదు. అందువల్ల ఇండియాలో అదీ నార్త్ లో ఉన్న ‘ఇంటర్ స్టెల్లార్’ అభిమానులు ‘పుష్ప 2’ ని ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Janhvi Kapoor
వీటికి బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి (Sridevi) కుమార్తె అయినటువంటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్పందించి తనదైన శైలిలో క్లాస్ పీకింది. జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. ” ‘పుష్ప-2’ కూడా ఒక సినిమానే అని మర్చిపోవద్దు. వేరే సినిమాతో దీన్ని పోల్చి తక్కువ చేయడం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్?మీరు ‘పుష్ప 2’ ని తక్కువ చేసి ఓ హాలీవుడ్ మూవీకి మద్దతు ఇస్తున్నారు కదా. అయితే హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఇప్పుడు మన ఇండియన్ సినిమాలను మెచ్చుకుంటున్నారు.
వీటి కోసం ఎగబడుతున్నారు. కానీ మనం మాత్రం మన సినిమాలను తక్కువ చేస్తూ మన స్థాయిని తగ్గించుకుంటున్నాం. ఇది మనకి అవమానకరం కూడా.! ఇలాంటి ట్రోల్స్ చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది” అంటూ పేర్కొంది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ లో(Devara) కూడా ఈమె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.