ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)..ల కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa2 The Rule) డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో డ్రాప్స్ కనిపించాయి. అయినప్పటికీ ఓవర్సీస్, నార్త్ వంటి ఏరియాల్లో భారీ వసూళ్లు సాధించింది.
Pushpa2 The Rule Collections:
టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ అస్సలు తగ్గడం లేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘పుష్ప 2’ (Pushpa2 The Rule ) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.199.89 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.405.32 కోట్ల షేర్ రావాలి. ఈస్ట్,వెస్ట్ వంటి ఏరియాల్లో రెండో రోజు సినిమా కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయ్యింది. శని,ఆది వారాల్లో జోరు పెంచితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.