అవార్డు వచ్చాక వెనక్కి తీసుకోరా.. తీసుకునే ముందైతే ఆపుతారా?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్  (Jani Master) కి ‘తిరు’  (Thiruchitrambalam) సినిమాలో ‘మేఘం’ అనే పాటను అద్భుతంగా కంపోజ్ చేసినందుకు గాను నేషనల్ అవార్డు వచ్చింది. అయితే అవార్డు అందుకనే టైంకి జానీ మాస్టర్ ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి.. జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

Allu Arjun

తర్వాత జానీ మాస్టర్ జైలుపై బయటకు వచ్చాడు. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘ఢీ జోడి’ తర్వాత జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన అమ్మాయితో..అతనికి పరిచయం ఏర్పడింది. ఆ షోలో పాల్గొనాలంటే మేజర్ అయ్యి ఉండాలి అనే కండిషన్.. ఈటీవీ వారు పెట్టారు. సో వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ చెక్ అనేది లేకుండా అయితే.. ఆమెను తీసుకోరు కదా. ఆ తర్వాత జానీ మాస్టర్ తో ఆమె ప్రేమలో పడటం జరిగింది.

ఈ పాయింట్ పైనే జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చింది. అలాంటప్పుడు అతని తప్పు లేనట్టే. మరి అతనికి రావాల్సిన నేషనల్ అవార్డు ఇవ్వాలి కదా అనేది కొందరి వాదన..! మరోపక్క అల్లు అర్జున్ (Allu Arjun) కూడా జైలుకు వెళ్ళాడు. నేరుగా ఓ మహిళ ప్రాణం అతను తీయలేదు… కానీ ఆమె చనిపోవడంలో అల్లు అర్జున్ ఓ కారణం. చాలా విధాలుగా ఇది ప్రూవ్ అయ్యింది.

మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ కి వచ్చిన నేషనల్ అవార్డుని కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకోలేదు.? అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కి (Allu Arjun) నేషనల్ అవార్డు వచ్చింది గతేడాది. అందుకుంది కూడా గతేడాదే..! సో అందుకున్నాక వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదట. కానీ జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం కోసం బెయిల్ రిక్వెస్ట్ పెట్టుకోవడం వల్ల.. ఆ టైంలో అతను ఎదుర్కొంటున్న ఆరోపణలను ఆధారం చేసుకుని క్యాన్సిల్ చేశారట. ఇదేం న్యాయమో వాళ్ళకే తెలియాలి.

రూ.70 లక్షల్లో తీశాను… సినిమా సూపర్ హిట్ అయ్యింది : ఉపేంద్ర!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus